సినీ ఇండస్ట్రీకి సంబంధించి గ్లామర్ పరంగా సరికొత్త ప్రమాణాలు తీసుకొస్తున్నారు హీరోయిన్లు. ఇదివరకంటే అచ్చతెలుగు చీరకట్టు, లైట్ గా నడుము వరకే చూపించడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. అదికూడా ఎంతో హెల్తీగా చూపించేవారు మేకర్స్. కానీ గత కొన్నేళ్లుగా ట్రెండ్ మారింది. లిప్ లాక్స్, టాప్ టు బాటమ్ అందాలను ఆరబోయడమే గ్లామర్ షో అనుకుంటున్నారు వయ్యారి భామలు. అయితే.. ఈ ట్రెండ్ లో కొత్తతరం హీరోయిన్స్ ఉన్నారంటే ఓకే.. కానీ ఇదివరకు హీరోయిన్స్ గా హోమ్లీ రోల్స్ చేసిన హీరోయిన్స్ కూడా అందాలకు అడ్డుతెర తొలగించి యంగ్ బ్యూటీలతో పోటీ పడుతున్నారు.
తాజాగా ఈ జాబితాలో చేరింది హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్. ఈ కేరళ భామ తెలుగు సినిమాల అన్నింట్లోను నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేసింది. ఎప్పుడూ, ఎక్కడకూడా స్కిన్ షో, గ్లామర్ షో వైపు వెళ్ళలేదు. తెలుగులో చివరిగా మోక్ష అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మీరా.. ఫ్యాన్స్ అందరికి అదిరిపోయే గ్లామర్ షోతో షాకిచ్చింది. గతంలో ఎన్నడూ చుడని విధంగా మీరా ఫోటోషూట్స్ సెగలు రేపుతున్నాయి.ట్రెండ్ కి తగ్గట్టుగా హాట్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మీరా హాట్ అందాలను కెమెరా ముందుంచుతోంది. సినిమాల్లో గ్లామర్ జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడిన మీరా.. ఇప్పుడు తెగించి ఎద అందాలను సైతం చూపించేసరికి ఫ్యాన్స్ షాక్ అవుతుంటే, గ్లామర్ ప్రియులు కళ్లప్పగించి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే.. ఈ హాట్ షో అంతా తాను సెకండ్ ఇన్నింగ్స్ లో బోల్డ్ రోల్స్ కి సిద్ధంగా ఉన్నాననే గుర్తు చేయడానికే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా మీరా పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే.. ఖచ్చితంగా బోల్డ్ పాత్రలకు రెడీ అని దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తుందేమో అనిపిస్తుంది. కెరీర్ లో భద్ర, గుడుంబా శంకర్, రన్, పందెం కోడి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోల సరసన నటించే అవకాశం ఉంది. ఇక తాజాగా మీరా పోస్ట్ చేసిన ఫోటోలలో అమ్మడి ఎద అందాలు, థైస్ కుర్రకారులో సెగలు రేపుతున్నాయి. లేత పచ్చరంగు డ్రెస్ లో మీరా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి మీరా జాస్మిన్ లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.