‘మంచు లక్ష్మి’ ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు, ఎలివేషన్స్ అవసరం లేదు. మంచువారమ్మాయిగా, నటిగా, తల్లిగా తనని తాను ఎంతో ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు యూట్యూబర్ గా కూడా తన సత్తా చాటుతోంది. అన్నింటికంటే ముందు మంచు లక్ష్మి ఫేమస్ అయ్యింది తన తెలుగుతో. తనపై వచ్చిన ట్రోల్స్ తోనే ఎక్కువ ఫేమస్ అయిపోయింది. కొన్ని కార్యక్రమాల్లో సెలబ్రిటీలకు ఇంగ్లీష్ నేర్పడం కూడా ఆమెకు మంచి పేరే తెచ్చింది. అయితే చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి తన తెలుగు వల్ల మరోసారి ట్రోలింగ్ కు గురైంది.
ఇటీవల కాలంలో మంచు లక్ష్మిపై భాషకు సంబంధించిన ట్రోలింగ్స్ ఏమీ రాలేదు. ఆమె తెలుగు కూడా చాలానే మెరుగైంది. ఇప్పుడు తాజాగా తను ఓ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోకి పెట్టిన కొటేషనే ఇప్పుడు చర్చకు, ట్రోలింగ్ కు దారి తీసింది. చెవికి కమ్మలు పెట్టుకున్న ఫొటో పెట్టి ‘Kamalu Pettukunna’ అని చెప్పుకొచ్చింది. ఇక నెటిజన్లు అందరూ ఆమె కొటోషన్ పై కామెంట్స్ మొదలు పెట్టారు. అవి కామాలు, ఫుల్ స్టాప్ లు కాదు.. కమ్మలు అంటారు అని కొందరు. ఇంకొందరు అవి కమలు కాదమ్మా కమ్మలు అంటారు అంటూ తెలుగు నేర్పించే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఈ కామెంట్స్ పై మంచు లక్ష్మి స్పందించలేదు. మంచు లక్ష్మి పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.