మేజిషియన్.. గారడి చేయడం పేర్లు ఏవైనా కానీ.. మనం చూస్తుండగానే.. మన కళ్ల ముందే.. రకరకాల మాయలు చేస్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు.. కానీ మన కళ్ల ముందే.. ఎన్నో వింతలు, విడ్డురాలు చోటు చేసుకుంటాయి. ఈ రంగంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వీరిలో ఒకరైన మెజిషియన్ అలీతో సుమన్ టీవీ ప్రత్యేంగా ఇంటర్వ్యూ నిర్వహించింది. ప్రస్తుతం బుల్లితెర మీద సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న మల్టీ టాలెంట్ పర్సన్ సుడిగాలి సుధీర్ కూడా ఈయన దగ్గరే మ్యాజిక్ నేర్చుకున్నాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో సుధీర్ హార్డ్‌వర్క్ మీద ప్రశంసలు కురిపించాడు మెజిషియన్ అలీ. 2008 సంవత్సరంలో సుధీర్ తనకు దగ్గరకు మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చాడని.. అప్పటి నుంచే ఎంతో కష్టపడేవాడని తెలిపాడు. మ్యాజిక్ నేర్చుకుంటూనే.. యాంకరింగ్, డ్యాన్స్ ప్రాక్టీస్.. ఇలా రోజంతా కష్టపడేవాడని.. అందుకే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడని తెలిపాడు. ఇక సుధీర్.. ప్రతి ఇంటర్వ్యూలో తన గురించి ప్రస్తావిస్తాడని.. చాలా మందిలో ఆ లక్షణం ఉండదని మెజిషియన్ అలీ తెలిపారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇద ఇకూడా చదవండి: ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం!