సింగర్ పార్వతి.. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి అంటూ మొత్తం తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రతి మనిషికి అందం కాదు.. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశయం ముఖ్యం అని నిరూపించింది. తాను పడిన కష్టం తన ఊరి వాళ్లకు రాకూడదని కోరుకుంది. తన పాటతో వాళ్ల ఊరికి బస్సు తీసుకొచ్చింది. అయితే ఇటీవల సరిగమప కార్యక్రమంలో న్యాయనిర్ణేత కోటి పార్వతికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అంటూ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: బాహుబలి-2 టాలీవుడ్ రికార్డును బ్రేక్ చేసిన RRR!
విషయం ఏంటంటే.. సింగర్ పార్వతి డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయ్యింది. ఎంతో గొప్ప పేరు సాధిస్తావని అనుకుంటుంటే డేంజర్ జోన్ లో ఏంటని అసహనం వ్యక్తం చేశారు. మా ఒక్కళ్లే కాదు.. మొత్తం తెలుగు అభిమానులకు నీపై ఆశలున్నాయంటూ కోటి సీరియస్ అయ్యారు. ఈ ఒక్క అవకాశం కల్పిస్తున్నాం. ఇంకోసారి ఈ పరిస్థితి ఉండదని తేల్చి చెప్పారు. ఫోన్లు, నిద్రలేకపోవడం వల్ల సరిగా ప్రాక్టీస్ చేయలేకపోయానని పార్వతి చెప్పడంతో అప్పుడే సెలబ్రిటీ అయిపోయావా అంటూ కోటి కన్నెర్ర జేశారు. పార్వతీ డేంజర్ జోన్ లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.