‘మా’ ఎన్నికలు జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు ప్యానల్స్‌కు చెందిన సభ్యులు అందరూ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారి వారి శిబిరాల్లో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకునే వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఎందరో వారివారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారంతా మేమంతా ఒకే కుటుంబం విమర్శలు సహజం అంటూ కామెంట్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. పోలింగ్ కేంద్రం వద్ద చిన్నపాటి ఫన్నీ సంఘటనలు కూడా జరిగాయి. తనను అడ్డుకున్నాడంటూ శివబాలాజీ చేయి కొరికింది హేమ. సరదాగా జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.