కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. 9 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేస్తూ నిర్మాతలకు లాభాల వర్షం కురిపిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ పేరు కూడా దేశవ్యాప్తంగా ఉన్న టాప్ డైరెక్టర్ల సరసన చేరింది. ఇదంతా కేవలం మూడు సినిమాలకే సాధ్యమైంది. అటు యశ్ కు కూడా కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హోదా లభించింది. బాలీవుడ్ ప్రేక్షకులు అయితే రాకీ భాయ్ కి నీరాజనాలు పడుతున్నారు. అంతటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2. ప్రస్తుతం సినిమా బృందం మొత్తం ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: హీరోపై లైంగిక ఆరోపణలు.. అవకాశాల పేరుతో వాడుకున్నాడని మహిళ ఫిర్యాదు!
యశ్ కూడా దాదాపు 3 సంవత్సరాలు ఛాప్టర్ 2 సినిమా కోసం కష్ట పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా సాధించిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఫ్యామిలీకి దూరంగా సినిమా కోసం కష్టపడిన యశ్.. ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య పిల్లలతో కలిసి వెకేషన్ కెళ్లాడు. అందరూ కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను భార్య రాధికా పండిట్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.