ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2, దేశంలోని సినిమా ప్రేక్షకులు స్మరిస్తున్న పేరు రాఖీబాయ్. తల్లికిచ్చిన మాటకోసం రోడ్డు మీద బూటు పాలిష్ చేసుకున్న స్థితినుంచి ఓ బంగారు గనికి అధిపతి స్థాయికి ఎదిగాడు రాఖీబాయ్. ఆ క్రమంలో అతను ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు దిగమింగాడు, సమాజంతో ఎంతో పోరాడు అనేది కేజీఎఫ్ సినిమా కథ. అందరూ ఆ సినిమా చూశారు. కానీ, యష్ నిజ జీవితంలోనూ రాఖీబాయ్ కు ఏమాత్రం తీసిపోని కష్టాలే ఉన్నాయి. వాటన్నింటిని ఎలా అధిగమించాడు? ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడో యష్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: లక్కీ చాన్స్ కొట్టేసిన అంజలి.. రామ్ చరణ్‌కు జోడిగా!
యష్ కర్ణాటకలోని హసన్ లో జన్మించాడు. తండ్రి అరుణ్ కుమార్ స్వస్తలం మైసూర్ కావడంతో అక్కడే పెరిగాడు. తండ్రి మైసూరులో బస్ డ్రైవర్ గా పనిచేసేవారు. ‘నాకు మొదటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాకు ఎందుకు ఆ కోరిక కలిగిందో తెలియదు. చిన్నప్పటి నుంచి హీరో కావాలనే కలలుగనేవాడిని. చిన్నప్పుడు క్లాస్ మీరు ఏం అంవుతారు అని అడిగితే.. అందరూ డాక్టర్, టీచర్, ఇంజినీర్ ఇలా ఏవేవో చెప్పేవారు. నేను మాత్రం హీరో అవుతా అని గట్టిగా చెప్పేవాడిని. ఆ సమయంలో అందరూ చులకనగా చూస్తూ నవ్వేవారు. అది కాస్త ఇబ్బందిగా అనిపించేంది. కానీ, నా లక్ష్యం నుంచి ఎప్పుడూ దూరంగా వెళ్లలేదు’.
‘నాలోని నటుడిని పరిచయం చేయడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకునేవాడిని కాదు. స్కూల్ లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పాటలు, డాన్స్ ఇలా ఏ కాంపిటీషన్ అయినే పాల్గొనేవాడిని. గెలవాలనే కాదు.. పాల్గొన్నందుకే ఎంతో ఆనందపడేవాడిని. నాలోని తపన చూసి స్కూల్లో టీచర్లు కూడా నన్ను హీరో అని పిలవడం మొదలు పెట్టారు. ఇంటర్ తర్వాత యాక్టింగ్ స్కూల్‌లో చేరతానంటే ఇంట్లో వద్దన్నారు. డిగ్రీ చేయమని చెప్పారు. అమ్మ అయితే మా మాట వినడం లేదని బాధపడింది. అయినా నేను వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఒప్పుకున్నారు. కానీ, సక్సెస్ కాకుండా ఇంటికి తిరిగివస్తే మాత్రం మళ్లీ తిరిగి ఇండస్ట్రీవైపు వెళ్లకూడదని మాట తీసుకున్నారు. సాధించి చూపిస్తానని మాటిచ్చి వచ్చా. ఇప్పుడు ఆ స్థాయికి చేరుకున్నా అంటూ యష్ తన జర్నీని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్-2 సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.