ఈ ఏడాది భారతీయ వెండితెరకి ఫుల్ మీల్స్ వడ్డించిన సినిమాల్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 ఒకటి. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేసింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అంతకంటే ఎక్కువగా కేజీఎఫ్ 2 హిట్ అయ్యింది. థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. అలాంటి సినిమా ఒక చోట మాత్రం హిట్ అవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక చోట మాత్రం డిజాస్టర్ అయ్యింది.
World Television Premiere Of #KGF2 On #ZeeTelugu Gets 9.15 TRP in Urban And 6.96 TRP in U+R Markets#YashBOSS𓃵 #SrinidhiShetty #sanjaydutt #prakashRaj #RaveenaTondon #Yash #Yash19 #KGFChapter2 @YashFClub @YashFansTweet @Yashfanscompany @YashTeluguFc pic.twitter.com/putcg3XtJV
— Telugu Television News (@TeluguTvExpress) September 2, 2022
మామూలుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు మొదటిసారిగా బుల్లితెర మీద ప్రసారమైనప్పుడు కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఎక్కువ టీఆర్ఫీ రేటింగ్ ఏ సినిమాకి వస్తే ఆ సినిమా బుల్లితెర మీద హిట్ అయినట్టు. అయితే ఈ విషయంలో కేజీఎఫ్ 2 ప్లాప్ అనే చెప్పాలి. రీసెంట్ గా కేజీఎఫ్ 2 సినిమా తెలుగు వెర్షన్ జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైంది. ఈ సినిమాకి కేవలం 9. 15 టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది. హైదరాబాద్ బార్క్ రేటింగ్ కేవలం 6.53 టీఆర్ఫీతో సరిపెట్టుకుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 బుల్లితెర మీద తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు 11.9 రేటింగ్ వచ్చింది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 కంటే ఛాప్టర్ 2 పెద్ద హిట్టు అయినప్పటికి టీఆర్పీ విషయంలో ఆ స్థాయిని అందుకోలేకపోయింది.
😎💥 highest for any kannada movie (post covid) #KGFChapter2 #KGF2 #Yash19 #YashBOSS pic.twitter.com/zxZRKtnXAV
— Only Yash™ (@TeamOnlyYash) September 2, 2022
రోబో, బిచ్చగాడు సినిమాలకొచ్చిన రేటింగ్ లో సగం కూడా కేజీఎఫ్ 2కి రాకపోవడం ఇప్పుడు అభిమానులను నిరాశపరుస్తుంది. అయితే కన్నడలో మాత్రం రికార్డు టీఆర్పీ రేటింగ్ దక్కించుకుంది. కన్నడ టెలివిజన్ లో ఎక్కువ సార్లు చూసిన సినిమాగా కేజీఎఫ్ 2.. 10.2 టీఆర్పీతో రికార్డు సృష్టించింది. కోవిడ్ తర్వాత ఏ సినిమాకి ఇంత రేటింగ్ రాలేదు. తెలుగు టెలివిజన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. సినిమా రిలీజైన కొద్ది రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం కూడా టీఆర్ఫీ రేటింగ్ రాకపోవడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నా మధ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ కూడా బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్ విషయంలో టాప్ 11లో నిలిచి అభిమానులని నిరాశపరిచిన విషయం తెలిసిందే. మరి కేజీఎఫ్ 2 టెలివిజన్ రేటింగ్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.