సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సాధారణంగా అందరు తమ తమ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటారు. దీనికి సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా కానీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా పెట్టింది. దాంట్లో ఏముంది అంటారా? పిక్ లో ఏం లేదు కానీ ఆమె ఇచ్చిన క్యాప్షన్ లోనే ఉంది అంతా. ప్రస్తుతం తన భర్తపై చేసిన రొమాంటిక్ కామెంట్ వైరల్ గా మారింది.
బబ్లీ బ్యూటీ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మెస్ట్ బెస్ట్ కపుల్స్ గా వీరికి పేరుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన ఈ కరీనా.. ఈ మధ్య దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే సోమవారం తమ కొడుకు తైమూర్ అలీఖాన్ బర్త్ డే సందర్బంగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అందులో ఒకటి సైఫ్ కండలు తిరిగి ఉన్న ఫోటో ఉంది. ఆ పిక్ ను తన ఇన్ స్టా స్టోరీగా పెట్టుకున్న కరీనా రొమాంటిక్ క్యాప్షన్ ఇచ్చింది. నా భర్త చాలా హాట్ అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేసింది. దాంతో అభిమానులంత ఈ పిక్ ను చూసి అవును నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్ తో పాటుగా తన కొడుకు బర్త్ డే పిక్స్ కూడా షేర్ చేసింది కరీనా. ప్రస్తుతం సైఫ్.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో రావణ్ గా నటిస్తున్నాడు. మరికొన్ని చిత్రాల్లో సందడి చేస్తున్నాడు. కరీనా ఇటీవలే అమిర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దాలో కలిసి నటించింది. ప్రస్తుతం ‘ది క్రూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.