నటి కరాటే కళ్యాణి వర్సెస్ యూట్యూబర్ బూతుల శ్రీకాంత్ రెడ్డిల వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. గురవారం రాత్రి యూసఫ్ గూడ పరిధిలో కరాటే కళ్యాణి తన అనుచరులతో కలిసి.. యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కరాటే కళ్యాణికి సైతం చెంపదెబ్బలు తిన్నది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటనానికి గల నిజమైన కారణాలు తెలియరాలేదు. కానీ, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. “శ్రీకాంత్ రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, తన పక్కలో పడుకోవాలని అడిగాడని.. అందుకే అతడి చెంప పగుల గొట్టానని కరాటే కళ్యాణి వెల్లడించిన సంగతి తెలిసిందే. కాదు.. కాదు.. కరాటే కళ్యాణి తనని డబ్బులు డిమాండ్ చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించాడు. ఈ క్రమంలో ఒక న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్న వీరిద్దరూ బూతు పురాణమే మొదలుపెట్టారు.
లైవ్ డిబేట్ లో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణిని ఉద్దేశిస్తూ.. “నేనేదో బూతు వీడియోలు చేసున్నానని ఆమె అంటోంది కదా.. మరి ఆమె చేసిన బూతుపురాణం ఏంటి? యూట్యూబ్ లో ఈ వీడియో లేంటి? డబ్బు కోసం ఆమె చేయలేదా? అని ప్రశ్నించాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కాస్త శృతిమించాడనే చెప్పాలి. పోరంబోకు దానా.. సినిమాలు అయితే బట్టలు విప్పి తిరగమన్నారా? అని కామెంట్ చేశాడు. అంతటితో ఆగక.. ఎవర్తివే నువ్వు.. నన్ను కొట్టడానికి అంటూ.. లైవ్ లోనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. అదే సమయంలో అక్కడున్న నిర్మాత చిట్టిబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. అతనికి కూడా మర్యాద ఇవ్వకుండా మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరి శ్రీకాంత్ రెడ్డి, కరాటే కళ్యాణిల వివాదంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Karate Kalyani: నేను మోసపోయా.. శ్రీకాంత్‌రెడ్డి 420 : కరాటే కళ్యాణి