బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ చేసిన ‘లాకప్’ షో ద్వారా అందులో పాల్గొన్న సెలబ్రిటీలకు సంబంధించి ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడిన సంగతి తెలిసిందే. అయితే.. లాకప్ షో ద్వారా పాపులర్ అయిన వారిలో యువనటి అంజలి అరోరా ఒకరు. సోషల్ మీడియా కోటికి పైగా ఫాలోయింగ్ కలిగిన అంజలి.. ఇటీవల ‘సైయా దిల్ మే ఆనా రే’ అనే ప్రైవేట్ సాంగ్ లో ఆడిపాడింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆ వీడియో సాంగ్ ద్వారా అంజలి ఓ వివాదంలో చిక్కుకుంది.
కొద్దిరోజుల కిందట అంజలి ఎంఎంఎస్ అనే ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అందరూ కూడా ఆ వీడియోలో ఉన్నది అంజలినే అని.. కన్ఫర్మ్ అయిపోయి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కామెంట్స్ పై విసుగుచెందిన అంజలి మొత్తానికి తన మౌనాన్ని వీడి ఎంఎంఎస్ వీడియో విషయంపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వీడియో గురించి స్పందిస్తూ అంజలి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది.
ఆమె మాట్లాడుతూ.. “ఎవరికైనా సొంత ఫ్యామిలీలో ఇలా జరిగితే వారు ఎలా బాధపడతారో తెలుసా అంటూ వీడియోని వైరల్ చేసిన వారిని ప్రశ్నించింది. ఇలా జరగడం ఫస్ట్ టైమ్ కాదు. ఈ విషయంపై ఇప్పటికే మా పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ్ కన్నన్ తో ఉన్న వీడియోకి నా పేరు, నా ఫోటో పెట్టి.. అది ‘అంజలి అరోరా MMS’ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు. ఇలా చేసేవారికి కూడా ఓ కుటుంబం ఉంటుంది. నాకూ ఓ కుటుంబం ఉంది’ అంటూ అంజలి ఏడ్చేసింది.
అంజలి ఇంకా మాట్లాడుతూ.. ‘ఎందుకు ఇలా చేస్తున్నారని కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతాను. యూట్యూబ్ లో పనికిమాలిన వ్యూస్ కోసం, అది అంజలి అరోరా ఎంఎంఎస్ అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నాకు ఓ ఫ్యామిలీ, ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ‘లాకప్’ షో నుండి బయటకి రాకముందు కూడా ఇలాగే జరిగింది’ అని అంజలి వాపోయింది. ఇక తన వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమేనని, ఇలాంటివన్నీ తట్టుకోగలిగే శక్తి తనకు లేదని చెప్పింది.’ ప్రస్తుతం అంజలి అరోరా మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.