సినీ ఇండస్ట్రీ అన్నాక సినిమావాళ్లపై ట్రోల్స్ రావడం కామన్. కానీ ట్రోల్స్, గాసిప్స్ అనేవి కూడా ఆ సెలబ్రిటీలను బాధించకుండా ఉంటే బాగుంటుందని చాలా సందర్భాలలో సెలబ్రిటీలు మాట్లాడటం చూస్తూ వచ్చాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ కి గురవుతున్న సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో జీవిత రాజశేఖర్ ఫ్యామిలీ ఒకటి. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ప్రీ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు.
యాంగ్రీ హీరో రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ తమ ఫ్యామిలీపై వస్తున్న పుకార్లను, ట్రోల్స్ ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. అలాగే ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా మమ్మల్ని మధ్యలోకి లాగుతుంటారని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవిత కుమార్తెలు శివాని, శివాత్మికలపై వచ్చిన వార్తలను, వారి గురించి క్రియేట్ చేసిన థంబ్ నెయిల్స్ పై ఆమె మండిపడ్డారు.
ఈ క్రమంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. “కొన్ని మీడియా సంస్థలు మా ఫ్యామిలీని టార్గెట్ చేసి అలా మా కూతుర్ల గురించి చెడు వార్తలు ప్రచారం చేశారు. మేం ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్ళాం. ఆ టైంలో నా కూతురు బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ వెళ్లిందని తప్పుడు వార్తలు రాశారు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో అర్థం చేసుకొండి. మా ఏదైనా సమస్య వస్తే మా తప్పు ఎంతవరకు ఉందో నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. మేము తప్పు చేశామని రుజువైతే నడిరోడ్డుపై నిలబెట్టి కొట్టండి. అంతేకానీ ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఇబ్బంది పెట్టకండి. గత 25 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నా. మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఇదివరకే శేఖర్ సినిమా ప్రెస్ మీట్ లో కూడా జీవిత తమ ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించారు. ‘మా ఆయనకు బాలేదని మా కూతుళ్లు తిరుమలకు వెళ్లి మెట్లెక్కారు. అలాంటి సమయంలో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు.. మా కూతుర్లు లేచిపోయిందంటూ పిచ్చి పిచ్చి థంబ్ నెయిల్స్ పెట్టేసి న్యూస్ రాశారు. వాళ్ళేదో చదువుకుంటూ యాక్టింగ్ అంటే ఇంటరెస్ట్ ఉండి.. వచ్చిన అవకాశాలతో సినిమాలు చేసుకుంటున్నారు. లోపల ఏం రాశారో ఎవ్వరూ చూడరు. థంబ్ నెయిల్స్ మాత్రమే చూస్తారుని.. కాబట్టి మాకు కూడా ఫ్యామిలీ ఉంది. అర్థం చేసుకోవాలంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం జీవిత మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి జీవిత మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.