Faria Abdullah: మొదటి సినిమా ‘జాతి రత్నాలు’తో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే ‘‘ చిట్టి’’గానే చాలా ఫేమస్ అయ్యారు. ‘జాతి రత్నాలు’ సినిమాలో చిట్టిగా తన నటనతో కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టారు. సినిమా సూపర్ హిట్ అయినా చిట్టికి పెద్దగా అవకాశాలు రాలేదు. జాతి రత్నాలు సినిమా హీరోయిన్‌గా ఏ సినిమా చేయలేదు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రావణాసుర’ సినిమాల్లో ఓ క్యారెక్టర్ చేశారు. ‘బంగార్రాజు’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేశారు. సినిమాల విషయం పక్కన పెడితే.. చిట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు.
తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఖాతాల్లో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంటారు. ఆమెకు సంబంధించిన డ్యాన్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. తాజాగా కూడా చిట్టి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో చిట్టి ఎంతో ఏకాగ్రతతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. చుట్టూ ఉన్న వారంతా ఆ డ్యాన్స్‌ను వీడియోను తీస్తూ ఉన్నారు. మరి, చిట్టి డ్యాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.