సినీ ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ ఫీల్డ్ లోకి మోడలింగ్ ద్వారా వచ్చి హీరోయిన్స్ అయ్యేవారు ఒకరకమైతే.. వారసత్వం ద్వారా వచ్చేవారు ఇంకో రకం. అయితే.. సినీ ఫీల్డ్ అనేసరికి హీరోయిన్స్ అంతా గ్లామర్ పైనే దృష్టి పెడతారని భావిస్తుంటారు. కానీ సినిమా అవసరాన్ని బట్టి అలా ఉంటారనేది నిజం. ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది.
సినిమాలలో ఒకలా, బయట మరోలా కనిపిస్తుంటారు. అయితే.. ప్రొఫెషనల్ లైఫ్ కి, పర్సనల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. కొందరు హీరోయిన్స్ వారు ప్రయాణిస్తున్న ప్లేస్ బట్టి అక్కడి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ డ్రెస్సింగ్ విధానం మెయింటైన్ చేస్తుంటారు. ఆ కోవకే చెందుతుంది దివంగత అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న జాన్వీ.. ముంబైలో స్టైలిష్ డ్రెస్సింగ్స్ కనిపిస్తుంది. అదంతా ఆమె పర్సనల్ లైఫ్ ని సూచిస్తుంది.ఇటీవల జాన్వీ కపూర్.. చిత్తూరులోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంది. శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన జాన్వీ.. అచ్చతెలుగు అమ్మాయిలా సాంప్రదాయ పద్దతిలో చీరకట్టుతో వచ్చి దైవదర్శనం చేసుకుంది. అయితే.. సాధారణంగా ముంబైలో జాన్వీ ధరించే డ్రెస్సింగ్ స్టైల్ కి, తిరుపతికి వచ్చినప్పుడు మాత్రం తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కానీ జాన్వీ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఆమె సాంప్రదాయ పద్దతి పై పొగడ్తలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఎల్లప్పుడూ ఎందుకు అలా ఉండదని సందేహపడుతున్నారు. ఇక ప్రస్తుతం జాన్వీ చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరి జాన్వీ కపూర్ చీరకట్టు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.