జబర్దస్త్.. ఎంతో మంది ఆర్టిస్ట్ ల జీవితాల్లో వెలుగులు నింపిన షో. కొన్ని లక్షల మందిని నిరంతరం నవ్విస్తున్న కామెడీ పోగ్రామ్. జబర్దస్త్ వల్ల లాభ పడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ.., ఓ సెక్షన్ పీపుల్ కి మాత్రం ఈ కామెడీ పోగ్రామ్ చాలానే విషాదాలని ఇచ్చింది. వారే జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్ట్ లు.
కడుపు కూటి కోసం అమ్మాయిలా వేషం వేస్తే.. వారిని ఈ సమాజం నిజంగానే అమ్మాయిలు అంటూ ఆట పట్టించింది. అసలు వాళ్ళు మగాళ్లే కాదు అంటూ పుకార్లు పుట్టించారు. ఈ దెబ్బకి నిజంగానే జెండర్ మార్చుకున్న ఆర్టిస్ట్ లు కూడా ఉన్నారు. దీంతో.., జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసే ఆర్టిస్ట్ లకి పెళ్లిళ్లు అవుతాయా అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నం అయ్యాయి. కానీ.., జబర్దస్త్ వినోద్ వీటన్నిటికీ తన పెళ్లితో సమాధానం ఇచ్చాడు. తాజాగా వినోద్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్ళికి జబర్దస్త్ ఆర్టిస్ట్ లు కూడా పెద్దగా హాజరుకాలేదు. చివరికి వినోద్ స్వయంగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది.
పెళ్లి జరిగాక వినోద్ తన మనసులోని బాధని బయటపెట్టాడు. నా మీద చాలా పుకార్లు పుట్టించారు. అసలు నేను మగాడినే కాదని మాట్లాడుకున్నారు. ఇలా నన్ను చిత్ర హింసలు పెట్టిన వారందరికి నా పెళ్లే ఓ సమాధానం.., ఇప్పుడు వారు ఏమి మాట్లాడతారు అంటూ జబర్దస్త్ వినోద్ ప్రశ్నించాడు. నా భార్య విజయలక్ష్మి నన్ను, నా వృత్తిని బాగా అర్ధం చేసుకుంది. ఆమెకి అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టే.., ఈ పెళ్లి సాధ్యం అయ్యిందని వినోద్ చెప్పుకొచ్చాడు. ఇక జబర్దస్త్ వినోద్ సొంత అక్క కూతురే ఈ విజయలక్ష్మి అని తెలుస్తోంది. ఏదేమైనా.. ఎన్నో ఇబ్బందులను దాటి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వినోద్ కి మీ శుభాకంక్షాలు తెలియచేయండి.