Shanthi Swaroop: ఈ మధ్యకాలంలో సినీతారలు, సీరియల్ ఆర్టిస్టులతో పాటు బుల్లితెరపై నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ సైతం హోమ్ టూర్ అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతవరకూ అభిమానులు తమ ఇల్లు ఎలా ఉంటాయో చూడలేదని సెలెబ్రిటీలంతా వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలను యూట్యూబ్ లో సొంత ఛానల్స్ లో అప్ లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ హోమ్ టూర్ జాబితాలోకి జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ చేరిపోయాడు. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న శాంతి స్వరూప్.. హైపర్ ఆది టీమ్ లో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఎన్నో వందల స్కిట్స్ లో తన శైలిలోని కామెడీతో ప్రేక్షకులకు చేరువైన శాంతి స్వరూప్.. ఇటీవల తాను పుట్టి పెరిగిన నెల్లూరు జిల్లా, జిట్రగుంట గ్రామంలోని సొంత ఇల్లు హోమ్ టూర్ వీడియో చేశాడు.
ప్రస్తుతం ప్రొఫెషన్ నిమిత్తం హైదరాబాద్ లో నివాసం ఉంటున్న శాంతి స్వరూప్.. సొంత ఊరికి వెళ్లి చాలా ఏళ్లయిందని చెబుతూ ఇల్లంతా చూపించాడు. అలాగే సొంత ఊరితో తనకున్న అనుబంధాన్ని వీడియోలో తెలియజేశాడు. ఇప్పుడు శాంతి స్వరూప్ హోమ్ టూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి శాంతి స్వరూప్ హోమ్ టూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.