తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బుల్లితెర కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటి. గత కొన్నేళ్లుగా అలరిస్తున్న ఈ షోలో ఇటీవలే చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మొన్నటివరకూ జడ్జిలుగా వ్యవహరించిన నటి రోజా.. ఇటీవల ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టేసరికి జబర్దస్త్ జడ్జి సీట్ కి సెలవ్ పెట్టేసింది. అయితే.. తాజాగా రోజా చివరి ఎపిసోడ్ కి సంబంధించి స్పెషల్ స్కిట్ చేసింది.
రోజాతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ, యాంకర్ రష్మీ కలిసి స్పెషల్ స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో కామెడీ ఏమోగానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోజా – పూర్ణ – రష్మీలకు మధ్య జరిగిన సంభాషణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రంగ రంగ వైభవంగా ప్రోగ్రాంను ఏ విధంగా పలికారో వీడియోలో చూడండి. మరి రోజా – రష్మీ – పూర్ణల సంభాషణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.