Rithu Chowdhary: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ప్రతి ఒక్కరూ పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్స్ విషయంలో సోషల్ మీడియానే ఉపయోగిస్తున్నారు. సినీ స్టార్స్ నుండి సీరియల్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వరకు అన్ని విషయాలను సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో పర్సనల్ విషయాలు, ప్రేమ, పెళ్లి వార్తలను కూడా పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి చేరినట్లు తెలుస్తుంది.
టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయినటువంటి నటులలో రీతూ చౌదరి ఒకరు. మొదట స్టార్ మా మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన రీతూ.. ఆ తర్వాత మోడలింగ్ లో అడుగుపెట్టి, యాంకర్ ప్రదీప్ పెళ్లిచూపులు ప్రోగ్రాంలో పాల్గొంది. ఆ ప్రోగ్రాం తర్వాత గోరింటాకు సీరియల్ ద్వారా నటిగా తన జర్నీ మొదలుపెట్టింది. అక్కడినుండి సీరియల్ నటిగా వరుస అవకాశాలతో బిజీ అయిపోయి ‘మౌనమే ఇష్టం’ అనే మూవీలో నటించింది.
ఈ క్రమంలో సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం సీరియల్స్ లో కీలకపాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే అప్పుడప్పుడు పాపులర్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో స్కిట్స్ చేస్తూ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంటుంది. ఇక షోలు, సీరియల్స్ గురించి పక్కన పెడితే.. రీతూ చౌదరి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సీరియల్ యాక్టర్ అయినప్పటికీ రీతూ చౌదరి తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ అని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లుగా పోస్ట్ పెట్టింది. కాబోయే భర్త శ్రీకాంత్ తో కలిసి ఫోటో షేర్ చేసిన రీతూ.. తమ బంధం కంటే ఏదీ బెటర్ కాదని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజెన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి రీతూ చౌదరి, శ్రీకాంత్ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Rithu x #Srikanth pic.twitter.com/raIL6cXxDA
— Hardin (@hardintessa143) July 16, 2022