తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ ఒకటి. సుడిగాలి సుధీర్ తర్వాత ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ.. మొదలైనప్పటి నుండి అటు వినోదం పరంగా, ఇటు ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త థీమ్, కాన్సెప్టులతో అలరిస్తున్న ఈ షోలో ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని ఎందరినో ఈ స్టేజిపై పరిచయం చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. సినీనటి ప్రగతి జడ్జిగా కనిపించిన ఈ ప్రోమోలో సీనియర్ హీరోయిన్ సంఘవి స్పెషల్ గెస్ట్ గా హాజరైంది. అయితే.. ఈ ప్రోమోలో హైపర్ ఆదితో పాటు పలువురు సీరియల్ ఆర్టిస్టులు జంటగా వచ్చి సందడి చేశారు.
ఈ క్రమంలో స్టేజిపై చేసిన పెర్ఫార్మన్స్ లలో జబర్దస్త్ ఫైమా, ప్రవీణ్ ల లవ్ ప్రపోజల్ హైలైట్ గా నిలిచింది. అయితే.. మొన్నటివరకూ ఫైమా, ప్రవీణ్ ఫ్రెండ్స్ అని భావిస్తున్న ప్రేక్షకులకు ఈ లవ్ సీన్ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. ఏకంగా రింగ్ తీసుకొచ్చి మరీ ప్రవీణ్.. మోకాళ్లపై కూర్చొని ఫైమాకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు. అలాగే మీ అమ్మకు అల్లుడు వస్తున్నాడని చెప్పు అని అనడంతో ఫైమా ఎమోషనల్ అయిపోయింది.
జబర్దస్త్ ఫైమా లైఫ్ స్టోరీ గురించి అటు యూట్యూబ్, ఇటు టీవీ ప్రేక్షకులకు తెలిసిందే. ఎంతో కష్టపడి ఫైమా వాళ్ళమ్మ సపోర్ట్ తో ఈ స్థాయికి ఎదిగింది. అలాగే తన తల్లి సొంతింటి కలను సైతం నెరవేర్చింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఈ కారణాలన్నీ చెప్పి ప్రపోజ్ చేసేసరికి స్టేజిపైనే ఏడ్చేసింది. ప్రస్తుతం ప్రవీణ్ – ఫైమాల లవ్ ప్రపోజల్ సీన్ నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందనేది ఆదివారం పూర్తి ఎపిసోడ్ లో చూడాలి. మరి ఫైమా, ప్రవీణ్ ల జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.