మనిషి జీవితం మూణ్ణాళ్ల ముచ్చట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండకపోవచ్చు. నిన్నటి వరకు సంతోషంగా సాగిన జీవితం.. రేపటి నాడు తలకిందులు అవ్వొచ్చు. అంతులేని కష్టాలు మనల్ని పలకరించవచ్చు. అసలు జీవితమే ముగిసిపోవచ్చు. రేపు ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఈ రోజే సంతోషంగా ఉండాలి.. నలుగురితో కలిసిమెలిసి చిరునవ్వుతో ముందుకు సాగిపోవాలంటారు పెద్దలు. ఎన్ని కష్టాలు వచ్చినా పెదాల మీద చిరునవ్వును చెరగనివ్వకూడదు. ఎంతటి బాధలో ఉన్న వ్యక్తిని అయినా మాములు మనిషిని చేయగలిగేది చిరునవ్వుతో కూడిన ఓ పలకరింపే. ఇవే మన తరువాత.. మన జ్ఞాపకంగా మిగిలిపోతాయి.
ఇక వెండితెర మీద ఎందరో హస్య నటులు తమ ప్రతిభతో ప్రేక్షకులును కడుపుబ్బా నవ్విస్తారు. అయితే చిరునవ్వులు చిందించే ఆ ముఖాల వెనక ఎన్నో కష్టాలు, కడగళ్లు. వాటిని మరిపించేది.. ప్రేక్షకుల చిరునవ్వే. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఒకప్పుడు తన ప్రతిభతో.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓ ఆర్టిస్ట్.. ప్రస్తుతం ప్రమాదకరమైన వ్యాధి బారిన పడి.. ఎన్నో అవస్థలు పడుతున్నారు. వైద్యం కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశారు.. మరికొంత డబ్బు అవసరం ఉంది. ఈ క్రమంలో సాయం కోరుతూ ఆయన సుమన్ టీవీ ముందుకు వచ్చారు. ఆ వివరాలు..
జబర్దస్త్ మిమిక్రి మూర్తి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో పాటు అనేక వేదికల మీద వేల ప్రదర్శనలు ఇచ్చారు. ఏ నటుడి గొంతునైనా అలవోకగా అనుకరించే టాలెంట్ మూర్తి సొంతం. 2018 వరకు ఆయన బుల్లితెరపై సందడి చేశారు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ‘ప్యాంక్రియాస్’ క్యాన్సర్ అనే వ్యాధికి గురయ్యారు. అంటే శరీరంలో ఇన్సులిన్ ను తయారు చేసే కణాలపై జరిగే దాడి. ప్రారంభంలో ఎటువంటి ప్రత్యేక లక్షణాలు చూపదు. చివరి స్టేజీలో భయటపడుతుంది. మూర్తి విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇప్పటికే వైద్యం కోసం 16 లక్షలు ఖర్చు చేయగా.. మరో 12 లక్షల రూపాయలు కావాల్సి ఉంది.
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుండే సుమన్ టీవీ.. ద్వారా మిమిక్రి మూర్తి తన పరిస్థితిని ప్రేక్షకులకు తెలియజేసి.. సాయం చేయాల్సిందిగా కోరుతున్నాడు. మూర్తికి సాయం చేయాలనుకునేవారు.. 9848029487 మొబైల్ నంబర్ కు గూగుల్ లేదా ఫోన్ పే చేయవచ్చు. పూర్తి వివరాల కోసం కింద వీడియోని చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.