బాలీవుడ్ స్టార్ హీరో, అమ్మాయిల గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. భార్యతో విడాకులు తీసుకొని సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే సింగిల్ గా ఉంటున్న హృతిక్ ప్రేమలో పడ్డాడని మీడియా వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆ వార్తకు బలం చేకుర్చేలా తాజాగా ఓ యువతి చెయ్యి పట్టుకొని నడుస్తూ కెమెరా కంటికి చిక్కాడు హృతిక్. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో హృతిక్ తో అంత చనువుగా ఉన్న ఆమె ఎవరు అంటూ నెటిజన్లు వెతికే పనిలో పడ్డారు.
హృతిక్ రోషన్ ఓ యువతి చేయి పట్టుకొని ముంబైలోని ఓ రెస్టారెంట్ లోకి వెళ్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. అయితే ఆ యువతి ఎవరనేది మొదట అర్థం కాలేదు. అయితే రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కారు ఎక్కేంత వరకు హృతిక్ ఆమె చేతిని వదలకపోవడంతో.. ఆమె ఎవరని తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. చివరకు ఆ యువతి మ్యుజీషియన్, నటి సబా ఆజాద్ అని తెలిసిపోయింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఇటీవల ఇద్దరూ గోవాలో హాలిడే ఎంజాయ్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది.
హృతిక్ రోషన్ భార్య సుసానే ఖాన్ తో విడిపోయిన విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న ఈ జంట అధికారికంగా వేరయ్యారు. సుసానే-హృతిక్ లకు ఇద్దరు కుమారులు. వారి సంరక్షణ బాధ్యత ఇద్దరూ చూసుకుంటున్నారు. విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లలతో కలిసి విందులు, విహారాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హృతిక్ వైవాహిక జీవితం అలా ముగిసింది. అయితే ఆయన సబా ఆజాద్ తో పబ్లిక్ లో షికార్లు చేయడం సంచలనంగా మారింది. 32 ఏళ్ల సబా ఆజాద్ గతంలో నసీరుద్దీన్ షా తనయుడు ఇమాద్ షాతో ప్రేమాయణం సాగించింది. అతనికి బ్రేకప్ చెప్పి ఇటీవల హృతిక్ కి దగ్గరైనట్లు సమాచారం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.