ఆమె చూస్తే నిండుగా ఉంటుంది. కేవలం నటిగా మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ గానూ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదంతే. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే ఆమె చిత్రాలు చూసేశారు. అక్కున చేర్చుకున్నారు. అన్నట్లు ఈ మధ్య ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో కాదు అపర్ణ బాలమురళి. కేరళకు చెందిన ఈ భామ.. త్రిసూర్ లో పుట్టి పెరిగిన ఈమె.. నటి కాకముందు సింగర్, డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ‘ఒరు సెకండ్ క్లాస్ యాత్ర’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. అలా మలయాళంతో పాటు తమిళంలోనూ మూవీస్ చేస్తూ పేరు సంపాదించింది. ‘సర్వం తాళమయం’ అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఇక లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘ఆకాశమే నీ హద్దురా!’ చిత్రంలో సుందరిగా మెప్పించే నటన కనబరిచింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది అబ్బాయిలు.. ఇలాంటి అమ్మాయే భార్యగా వస్తే బాగున్ను అనుకున్నారు. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ఆమె పాత్ర ఎంతలా క్లిక్ అయిందో. అలా ఈ సినిమాతో ఉత్తమనటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు చేస్తోంది. మరి అపర్ణ బాలమురళి చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: డాన్స్ తో మనసు దోచుకున్న చిన్నారి! ఎలాగైనా ఆ పాపను కలవాలంటూ రష్మిక ట్వీట్!