Siddharth: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల రిలేషన్ షిప్ పై రూమర్స్ రావడం అనేది మామూలే. హీరో, హీరోయిన్ జంటగా ఎక్కడ కనిపించినా రిలేషన్ షిప్ లో ఉన్నారని లేదా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. కొంతకాలంగా హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి గురించి ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కొందరు ప్రేమలో ఉన్నారంటే.. మరికొందరు అదేం లేదంటూ చెప్పుకొచ్చారు. కానీ.. తాజాగా ఇద్దరు కలిసి ఒకేచోట కనిపించడంతో రిలేషన్ లో ఉన్నారని వార్తలకు బలం చేకూరిందని చెప్పాలి.
తెలుగులో మంచి హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సిద్ధార్థ్. కానీ.. కొన్నేళ్ల వరకూ ఎందుకో తెలుగు సినిమాలు చేయలేదు. ఇటీవలే ‘మహా సముద్రం’ అనే సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఇదిలా ఉండగా.. మహా సముద్రం మూవీలో హీరోయిన్ అతిథిరావు, సిద్ధార్థ్ జంటగా నటించారు. ఆ సినిమా టైంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారంటూ రూమర్స్ వచ్చేశాయి.
తాజాగా సిద్ధార్థ్, అతిథి ఇద్దరు ముంబైలోని ఓ సెలూన్ నుండి బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు సెలూన్ నుండి బయటికి వస్తుండగా మీడియా ఫోటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. ఫోటోలు తీసే క్రమంలో సిద్ధార్థ్ ఫోటోగ్రాఫర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు కొందరు వీడియోలు కూడా తీయడం జరిగింది. మరి ఇద్దరు రిలేషన్ లో లేకపోతే ఇలా చెట్టాపట్టాలేసుకొని ఎందుకు తిరుగుతారు? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్, అతిథి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Siddhartha spotted in Mumbai by paparazzi: pic.twitter.com/eTZJmjeyMj
— HT Entertainment (@htshowbiz) July 20, 2022