సినీ ఇండస్ట్రీలో పైకి రావాలంటే అందం, టాలెంట్ తో పాటు కాస్తయినా అదృష్టం ఉండాలి అనేది ఒకప్పుడు నమ్మాలని అనిపించేది కాదు. కానీ.. కొంతమంది హీరోయిన్స్ ఎప్పుడో డెబ్యూ చేసి.. కెరీర్ లో హిట్స్ పడినా స్టార్డమ్ అందుకోలేకపోతారు కదా! అప్పుడు ఈ అదృష్టం అనేది నిజంగానే వర్కింగ్ ఎలిమెంట్ అనిపిస్తుంది. ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్స్ టాలీవుడ్ లోకి వస్తుంటారు.. పోతుంటారు. వీరిలో హిట్స్ పడితే మరో రెండు సినిమాలు చేస్తారు లేదా ఒక్క సినిమాతోనే సర్దుకొని వెళ్ళిపోయేవారు ఉంటారు.. లేదు లేదు ఇక్కడే నా లైఫ్ అని ఏ క్యారెక్టర్ వచ్చినా చేసేవారు ఉంటారు. అలా హీరోయిన్ గా హిట్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి.. వరుస ప్లాపుల్లో పడిపోయిన బ్యూటీ హెబ్బా పటేల్.
తెలుగులో ‘అలా ఎలా’ అనే మూవీతో డెబ్యూ చేసిన హెబ్బా.. ఆ తర్వాత ‘కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి వరుస హిట్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నుండే స్క్రిప్ట్ సెలక్షన్ పరంగానో లేక త్వరత్వరగా సినిమాలు చేసేయాలనే ఆలోచనో తెలీదు. కానీ.. వరుసగా ప్లాప్స్ ని మూటగట్టుకుంది. నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా సినిమాలతో హీరోయిన్ గా పడిపోయి.. రెడ్ లో ఐటమ్ సాంగ్, భీష్మలో వ్యాంప్ క్యారెక్టర్ చేసి షాకిచ్చింది. అయినా అవకాశాలు సన్నగిల్లడంతో చేసేదేం లేక ఓటిటిలోకి ఎంటర్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, హెబ్బాకి సాలిడ్ హిట్ అవసరం అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో హెబ్బాకి 16 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. హెబ్బా ఎప్పుడెప్పుడు హిట్టు కొడుతుందా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఫాలోయర్స్ ని, నెటిజన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. హెబ్బా గ్లామర్ షో గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ గా చేసిన బ్యూటీ.. ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తోందంటే.. అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాటం లేదని అర్థమవుతుంది. కాగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హెబ్బా తాజాగా వేడెక్కించే ఫోటోలు పెట్టి సర్ప్రైజ్ చేసింది. ప్రస్తుతం హెబ్బా హాట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి హెబ్బా పటేల్ గ్లామర్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.