టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటంటే.. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్‌లో భాగంగా.. సమంత, విజయ్‌లపై కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్నారట. సినిమాలో ఇదే అత్యంత ప్రమాదకరమైన సన్నివేశం అని టాక్. సీన్ షూట్‌లో భాగంగా నదికి రెండువైపులా కట్టిన తాడుపై కారు నడపాల్సిన పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తూ ఆ వాహనం పట్టు తప్పి నదిలో పడిపోయింది. దాంతో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే తేరుకున్న సిబ్బంది.. సమంత, విజయ్‌లను దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిపై దర్శకుడు శివ నిర్వాణ స్పందించారు. షూటింగ్‌లో ప్రమాదం జరిగింది అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు.
‘‘ఖుషి సినిమా షూటింగ్ సమయంలో యాక్సిడెంట్ జరిగిందని.. సమంత, విజయ్ దేవరకొండ గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అవన్ని అవాస్తవాలు. సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగింది అనేది ఫేక్ న్యూస్. అందులో వాస్తవం లేదు. కశ్మీర్‌లో 30 రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా షూటింగ్ జరుపుకుని.. టోటల్ యూనిట్ ఆదివారమే హైదరాబాద్ వచ్చాం. షూటింగ్‌లో ప్రమాదం జరిగిందనే వార్తలు అవాస్తవం. అలాంటి వాటిని నమ్మకండి’’ అంటూ శివ నిర్వాణ ప్రకటన విడుదల చేశారు. దాంతో సామ్-విజయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
Fake news pic.twitter.com/dbneXS8h5s
— Shiva Nirvana (@ShivaNirvana) May 24, 2022
ఇది కూడా చదవండి: Khushi: విజయ్ దేవరకొండ ‘ఖుషి’ సినిమాపై నార్త్ ఆడియెన్స్ ఆగ్రహంగా ఉన్నారా..?
ఇక శివ నిర్వాణ దర్శమైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు చేస్తూ.. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌లో.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే షూటింగ్‌లో ప్రమాదం జరిగిందనే వార్తలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా ఇది ఫేక్ న్యూస్ కావడంతో రిలాక్స్ అయ్యారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Liger: రికార్డు స్థాయిలో రూ. 106 కోట్లకు అమ్ముడైన ‘లైగర్’ నాన్-థియేట్రికల్ రైట్స్..!