తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా టాలీవుడ్ ని కొన్నేళ్లపాటు ఓ ఊపు ఊపేసిన వారిలో రంభ ఒకరు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి రాగానే రంభ అని మార్చారట. అలా కెరీర్లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన రంభ.. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఇక అందరు హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.
ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు రాకపోయేసరికి పలు ఐటమ్ సాంగ్స్ లోనూ ఆడిపాడింది. మెల్లగా సినిమాలకు బై చెప్పి.. 2010లో కెనడాకు చెందిన ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు. అలా సాఫీగా సాగిపోతున్న టైంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల వరకు వెళ్లారట. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారని సమాచారం.
ఇక పిల్లల పోషణతో పాటు ఇతర ఖర్చులకు నెలకు రూ. 5 లక్షలు తనకు భరణంగా ఇవ్వాలని రంభ తన పిటీషన్ లో పేర్కొందట. ఈ క్రమంలో రంభకు బొంబాయి ప్రియుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకేంద్రుడు రాగేవేంద్రరావు.. రంభతో మాట్లాడి మళ్లీ భార్యాభర్తలను కలిపారని తెలుస్తుంది. అంతేగాక భర్తకు దూరమైతే సమాజంలో ఫేస్ చేయాల్సిన ఇబ్బందులు, పిల్లల పోషణ గురించి రాఘవేంద్రరావు రంభకు హితబోధ చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
అలా రాఘవేంద్రరావు చెప్పిన మాటలు విన్న తర్వాత రంభ.. చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని అర్థం చేసుకొని తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుందట. ఆ విధంగా రంభ వెంటనే తన భర్త వద్దకు వెళ్ళిపోయి హ్యాపీగా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుందట. ఇదిలా ఉండగా.. రంభ త్వరలో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి హీరోయిన్ రంభ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.