డీజే టిల్లు సినిమాను వివాదాలు వదలడం లేదు. సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ సినిమా ట్రైలర్ లోని ఓ డైలాగ్ ని ఉద్దేశించి అడిగిన ప్రశ్నతో వివాదం ప్రారంభమయ్యింది. తరువాత సదరు రిపోర్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హీరో సిద్ధు కూడా కొన్ని వివాదాస్పద ప్రశ్నలు ఎదుర్కున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రేక్షకుడిని ఉద్దేశించి.. ఈ సినిమా నిర్మాత చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు నిర్మాత ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపాడు.
“ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థ కైనా బలం. . ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో ‘డిజె టిల్లు’ విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనం తో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించటం వల్లే. అయినా వారి మనసు నొచ్చు కోవటం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం” అంటూ చెప్పుకొచ్చాడు.
🙏 pic.twitter.com/WzjueNtDOw
— Naga Vamsi (@vamsi84) February 18, 2022
వివాదం ఏంటంటే
సినిమా విడుదలైన రోజు చిత్ర బృందం అంతా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ సినిమా కలెక్షన్ల గురించి ఆడియోన్స్ స్పందన ఏంటని ప్రశ్నించగా.. ఆ లెక్కలన్ని మనలాంటి మేధావులు అర్థం అవుతాయి.. కానీ ప్రేక్షకుడికి ఏం తెలుస్తుంది. వాడిచ్చే 150 రూపాయలకు సరిపడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చామా లేదా అన్నదే వాడికి ముఖ్యం అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి.. కించపరుస్తూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. నిర్మాతపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనిర్మాత వంశి.. ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులకు క్షమాపణలు తెలియజేశారు.
Is this the manners how a producer should show on audience.. Attitude unte vere vaatillo choopinchu not on talking about the audience
Monna #DJTillu event lo nuvvu @vamsi84 miss ayyi #SureshKondeti dorikadu anthe..pic.twitter.com/9Qm2KyThSH
— Censor Buzz (@Censor_Buzz) February 16, 2022