టీవీ షోల కల్చర్ పెరిగిన తర్వాత చాలామంది కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జబర్దస్త్’, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ షోలు మాత్రమే కాకుండా ‘పటాస్’ లాంటి షో కూడా అప్పట్లో సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం స్టార్ కమెడియన్స్ గా చలామణీ అవుతున్న సద్దాం, నూకరాజు, ఇమ్మాన్యుయేల్, ఫైమా, యాదమ్మ రాజు.. వీరందరూ కూడా ఈ షో నుంచి వచ్చినవాళ్లే. ఇప్పుడు ఎవరికి వాళ్లు.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. మూడు షోలు, నాలుగు ఈవెంట్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే యాదమ్మ రాజు.. పెళ్లికి కూడా రెడీ అయిపోయాడు. తాజాగా ఎంగేజ్ మెంట్ కూడా జరిగిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘పటాస్’ షోలో స్టూడెంట్ గా అడుగుపెట్టిన యాదమ్మ రాజు.. ఓ జోక్ వేసి వైరల్ అయిపోయాడు. ఇది బాగా పేలేసరికి.. అతడిని పార్టిసిపేంట్ గా అవకాశం దక్కింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకున్న రాజు.. బాగా పాపులర్ అయిపోయాడు. ఇక ఇతడికి స్టెలా రాజ్ అనే గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. చాలాకాలం నుంచి వీళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. కలిసి షోల్లో కూడా చాలాసార్లు కనిపించారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ‘కామెడీ స్టాక్ ఎక్సేంజ్’ షో చేస్తున్న రాజు.. తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు కూడా వైరల్ గా మారడంతో ఈ విషయం బయటపడింది.
ఇక యూట్యూబర్ గా స్టెల్లా చాలామందికి తెలుసు. యాదమ్మ రాజుతో కలిసి ఈమె చాలా ఫన్నీ వీడియోలు కూడా చేసింది. ఇక తాజాగా ఎంగేజ్ మెంట్ జరగ్గా.. త్వరలోనే వీళ్ల పెళ్లి కూడా ఉండదనుందని తెలుస్తోంది. ఇకపోతే గతేడాది ‘అదిరింది’ షోతో సరికొత్త చాప్టర్ స్టార్ట్ చేసిన యాదమ్మ రాజు.. సద్దాంతో చేసి ఫన్నీ స్కిట్స్ నెక్స్ట్ లెవల్లో వైరల్ గా మారాయి. సద్దాం-రాజు స్టేజీపై ఉన్నారంటే ఫన్ వేరే లెవల్లో ఉంటుంది. ఈ విషయం రెగ్యులర్ గా టీవీ షోలు చూసే ఎవరైనా సరే టక్కున చెప్పేస్తారు. సరే ఇదంతా పక్కనబెడితే యాదమ్మ రాజు-స్టెలా ఎంగేజ్ మెంట్ ఫొటోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.