నిఖిల్ విజయేంద్రసింహ… ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఒక యాంకర్ గా, ఒక నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా నిఖిల్ విజయేంద్ర సింహ అవార్డును అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ విజయేంద్ర సింహ కావటం విశేషం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్స్రర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
చేసే ఇంటర్వ్యూలు కూడా ఎంతో ఆసక్తిగా ఉంటాయి. టాలీవుడ్ బుల్లితెర నుంచి ఎంతోమంది సెలబ్రిటీలను విజయేంద్రసింహ ఇంటర్వ్యూలు చేశాడు. అతను చేసిన ఇంటర్వ్యూలు యూట్యూబ్లో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇంటర్వ్యూలు ఫన్నీగా సాగితే.. మరికొన్ని ఇంటర్వ్యూలు గాసిప్స్ కు తావిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా, యూట్యూబ్ ఫేస్ బుక్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో.. సెలబ్రిటీలను అడగాలనుకుని అడగలేకపోయినా ఎన్నో ప్రశ్నలను నిఖిల్ సింహా అడుగుతూ ఉంటాడు. అభిమానులు సెలబ్రిటీల నుంచి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారి తరఫున అడిగి నిఖిల్ సమాధానం రాబడుతూ ఉంటాడు. నటుడిగా కూడా నిఖిల్ సింహా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
నిఖిల్ తరచూ పార్టీలు కూడా ఇస్తూ తారలను ఆనందపరి చేస్తూ ఉంటాడు. జగన్ క్రిస్మస్ సందర్భంగా నిఖిల్ తన ఇంట్లో ఒక పార్టీ నిర్వహించాడు. పార్టీలో సినిమా బుల్లితెర నుంచి ఎంతోమంది తారలు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను నిఖిల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నిఖిల్ ఇచ్చిన పార్టీలో మంచు లక్ష్మి, హంస నందిని, నటి ప్రగతి, రాజ్ తరుణ్, రాజశేఖర్ కుమార్తెలు, అనసూయ, యాంకర్ ప్రదీప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆ వీడియోలు ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.