సాధారణంగా సెలబ్రిటీలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు.. ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలా పెళ్లీడుకి వచ్చిన సెలబ్రిటీలలో సినీ తారలతో పాటు టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు కూడా లైన్ లో ఉన్నారు. ఎంతోకాలంగా పెళ్లి రూమర్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ విషయం ఏంటనేది అంత ఈజీగా క్లారిటీ ఇవ్వరు. కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ టీవీ యాంకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతలో ఆ యాంకరమ్మే స్వయంగా తన పెళ్లి వార్తను బయటపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి ఆ బ్యూటీ ఎవరో కాదు.. నేహా చౌదరి.
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న సెలబ్రిటీలలో యాంకర్ నేహా చౌదరి ఒకరు. టీవీ షోలతో పాటు పలు క్రీడలకు సంబంధించి కూడా ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేస్తుంటుంది. ఇంతకాలం తనపై వస్తున్న పెళ్లి వార్తలను ఖండిస్తూ వచ్చిన నేహా.. తాజాగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. అంతేగాక తాను పెళ్లాడబోయే వరుడిని కూడా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జిమ్నాస్టిక్స్ లో నేషనల్ లెవల్ ఛాంపియన్ గా పేరొందిన నేహా.. యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే పలు స్పోర్ట్స్ కి తెలుగు హోస్ట్ గా వ్యవహరించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో తనకు పెళ్లీడు వచ్చేసరికి ఎంతోకాలంగా పెళ్ళెప్పుడు? అనే ప్రశ్న వెంటాడుతోందని.. తన తల్లి కూడా ఎప్పటినుండో పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టిందని ఆ మధ్య బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చెప్పింది. అలాగే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక తాను పెళ్లి చేసుకోబోతున్నానని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునతో చెప్పింది. దీంతో నేహా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఆమె పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొన్నటిదాకా తన పెళ్లి రూమర్స్ పై స్పందించని నేహా.. ఏకంగా కాబోయే భర్తను పరిచయం చేస్తూ వీడియో చేసింది. అయితే.. నేహా పెళ్లి వార్తను తన ఫ్రెండ్స్ సమక్షంలో అనౌన్స్ చేయడం విశేషం.
ఓ రకంగా నేహా పెళ్లి వార్తను వినడానికి తన ఫ్రెండ్స్ యాంకర్ ప్రశాంతి, సింగర్ లిప్సిక, ఆర్జే కాజల్ తదితరులు వచ్చారు. నేహా తనకు కాబోయే వాడిని చూపించగానే ఏకంగా పెళ్లి చూపులలో పెద్దలు అడిగే ప్రశ్నలు కూడా వీరే అడిగేశారు. ఇదిలా ఉండగా.. కాబోయే భర్త పేరు అనిల్ అని.. 13 ఏళ్లుగా తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది నేహా. ఈ వీడియోని తన సొంత ఛానల్ లో.. ‘నా పెళ్లి గోల మొదలైంది’ అనే పేరుతో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు నేహాకు కంగ్రాట్స్ చెబుతూ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.