బిగ్‌బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోగో, టీజర్ వదిలి ప్రేక్షకులను అలర్ట్ చేసింది బిగ్‌బాస్ టీమ్.. ఏయే కంటెస్టెంట్లను తీసుకోవాలి? ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అన్నది పకడ్బందీగా లిస్టు రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక షో ప్రారంభం అయ్యేలోపు బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎన్నో పేర్లు తెర మీదకు వస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర పేరు వినిపిస్తోంది. ఆ వివరాలు..
ఓ ఫీమేల్ సింగర్‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి దింపనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు బుల్లెట్టు బండి సింగర్ ‘మోహన భోగరాజు‘. ఆమెను నేరుగా షో ప్రారంభంలోనో లేదంటే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారానైనా లోనికి పంపించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం భారీ రెమ్యునరేషన్ ఆమెకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు.. సోషల మీడియాలో సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ రివ్యూయర్స్ ఆది రెడ్డి, గీతూరాయల్, సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్, శ్రీ సత్య, దీపిక పిల్లి, అర్జున్ కల్యాణ్, కమెడియన్ చలాకీ చంటి, యాంకర్ ఆరోహి రావు, వాసంతి కృష్ణన్, చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప హౌస్‌లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఆర్జే సూర్య, నేహా చౌదరి, హీరోయిన్ ఇనయ సుల్తానా, అప్పారావు, తన్మయి పేర్లు ప్రచారంలో ఉన్నా వీళ్లు ఈ సీజన్‌లో అడుగు పెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా కంటెస్టెంట్ చివరి నిమిషంలో హ్యాండిస్తే మాత్రం వీరిలో ఎవరినైనా ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంది. వీరంతా నిజమో అంటే.. మనకు కూడా తెలియదు. బిగ్‌బాస్ స్టార్ట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే! అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఆరో సీజన్ సెప్టెంబర్ 4 నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.