‘అషూరెడ్డి’ సోషల్ మీడియా, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టిక్ టాక్, సోషల్ మీడియాతో క్రేజ్ సంపాదించి.. బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది అషూరెడ్డి. కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఇంకా పాపులర్ అయ్యింది. తన బోల్డ్ మాటలు, బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటుంది అషూరెడ్డి. మరోవైపు కామెడీ స్టార్స్ వంటి షోలతోనూ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు కొత్త ట్రాక్ లోకి అడుగుపెడుతోంది అషూరెడ్డి. ఒక కవర్ సాంగ్ తో డాన్సర్ గా కూడా పరిచయం కాబోతోంది.
పాన్ ఇండియా హిట్ పుష్ప సినిమా నుంచి ఊ అంటావా.. ఉఊ అంటావా సాంగ్ కు అషూరెడ్డి పర్ఫార్మ్ చేయబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది అషూరెడ్డి. ఇప్పుడు అవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. గెస్ ది సాంగ్ అంటూ అభిమానులకు ప్రశ్నలు సంధించింది. గెటప్, స్టిల్స్, మేకోవర్ అంతా పుష్ప ఐటమ్ సాంగ్ లానే కనిపిస్తోంది. అభిమానులు కూడా అదే సాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాంగ్ అతి త్వరలోనే అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపారు. అషూరెడ్డి డాన్స్ చేయబోయే సాంగ్ ఏమై ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.