టాలీవుడ్ లో డిఫరెంట్ సబ్జెక్టులతో, కొత్త కథలతో సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు‘ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి డీజే టిల్లుకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసి.. పూజా కార్యక్రమం కూడా పూర్తిచేశారు.
ఇక సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి దర్శకుడు విమల్ కృష్ణ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో దర్శకుడు మల్లిక్ రామ్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. సినిమాలో టిల్లుకి జోడిగా రాధికా పాత్రలో నేహా శెట్టి నటించింది. ఇప్పుడు సీక్వెల్ లో నేహా శెట్టి ప్లేస్ లో రాధికగా అనుపమ పరమేశ్వరన్ ఓకే అయ్యిందని సమాచారం. అలాగే అనుపమ సీక్వెల్ కోసం ఒప్పందంపై సైన్ కూడా చేసినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.
రాధికా పాత్రకు అనుపమ సరైనదని, పాత్రకు న్యాయం చేయగలదని మేకర్స్ భావించి ఆమెకు అవకాశం ఇచ్చారట. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. డీజే టిల్లు మూవీలో కామెడీతో పాటు రొమాన్స్, బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే.. ఈ విషయంలో అనుపమ అన్నింటికీ అంగీకరించి సినిమా ఓకే చేసిందని సమాచారం.
ఇటీవల రౌడీ బాయ్స్ సినిమాతో అనుపమ బోల్డ్, రొమాన్స్ సన్నివేశాలకు తెరలేపింది. అలాగే సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచేసింది. కాబట్టి.. సినిమాలో బోల్డ్ సీన్స్ చేసేందుకు సిద్ధంగానే ఉంటుందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఈ డీజే టిల్లు సీక్వెల్ ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. హీరో సిద్ధునే సీక్వెల్ స్క్రిప్ట్, డైలాగ్స్ రాశాడట. మరి డీజే టిల్లు రాధికగా అనుపమ ఎంటర్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#AnupamaParameswaran is part of #DJTillu2 ? Interesting! #Anupama #SiddhuJonnalagadda
— Sashidhar Adivi (@sashidharadivi) August 12, 2022
Anupama is the new Radhika for DJ Tillu?
Read full story here👇
https://t.co/Gm1lcjoOkJ#anupamaparameshwaran #Sidhu #radhika #djtillu #Djtillu2 #love #tollywood pic.twitter.com/CtwSmlwZCD— TeluguOne (@Theteluguone) August 10, 2022