సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీ, నటులు చాలా బిజీ బిజీగా గడుపుతుంటారు. దాంతో కాస్త గ్యాప్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా మల్దీవులకు వెళ్తుంటారు. కొన్ని రోజుల క్రితం రష్మికా మందన్నతో పాటుగా రౌడీ హీరో విజయ్ మల్దీవులకు వెళ్లిన ఫొటోలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా మల్దీవుల్లో వెకేషన్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో కుర్రకారును కవ్విస్తోన్న రష్మీ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రష్మీ గౌతమ్.. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. జబర్దస్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. ఓన్లీ యాంకరింగే కాకుండా అటు వెండితెరపై కూడా తన టాలెంట్ ను నిరూపించుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. గుంటూర్ టాకీస్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. అప్పుడప్పుడు వెండితెరపై దర్శనమిస్తునే ఉంది. తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి టాక్ తో థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న రష్మీ కాస్త టైమ్ దొరకడంతో మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లింది. అక్కడ తెగ ఎంజాయ్ చేస్తోంది.
ఈక్రమంలోనే అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో సముద్రాన్ని చూస్తు.. వినసొంపైన సంగీతంలో మునిపోయింది. నీటిలో మునిగి తన చేతులతో లవ్ సింబల్ ను పెట్టింది.”ఒన్స్ ఏ వాటర్ బేబీ ఆల్ వేజ్ ఏ వాటర్ బేబీ” అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. బ్లూ కలర్ టూ పీస్ బికినీ లో స్విమ్మింగ్ పూల్ నీటి రంగులోనే రష్మీ కలసిపోయింది. రష్మీ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందిస్తున్నారు. ”మీ అందానికి పూల్ లోని చల్లటి నీళ్లన్ని వేడెక్కినాలా!” మీరు సముద్రంలో చేపపిల్లలా ఉన్నారంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.