సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే అమ్మాయిలంతా హీరోయిన్స్ కావాలనే గోల్ తో వస్తుంటారు. కొందరు అదృష్టం కొద్దీ హీరోయిన్స్ అవుతుంటారు. కొందరికి స్కిల్స్ బట్టి వారి ప్రొఫెషన్స్ మారుతుంటాయి. ఆ విధంగా హీరోయిన్ అయ్యేందుకు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాంకర్ గా స్థిరపడిపోయింది మంజూష రాంపల్లి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చినప్పటికీ యాంకర్ మంజూషగా పాపులర్ అయ్యింది. అయితే.. యాంకర్ గా బిజీ అయినా ఆమెలో యాక్టింగ్ ఇంటరెస్ట్ పోలేదని సోషల్ మీడియా మంజూష పోస్టులు చూస్తే అర్థమవుతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే మంజూష ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫోటోషూట్స్, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. మంజూష యాంకర్ గా ఎంత పాపులర్ అయినప్పటికీ, సినిమా లవర్స్ అందరికి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగానే బాగా దగ్గరైంది. ఆ సినిమాలో మంజూష ఎమోషనల్ నటనకు అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. కానీ ఎందుకో ఈ యాంకరమ్మ.. ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. ఆశించిన స్థాయిలో ఆమెకు అవకాశాలు రాలేదని టాక్.
ఇదిలా ఉండగా.. మూడు పదుల వయసు పైబడినా మోడలింగ్ ని మాత్రం వదలలేదు. ఓవైపు యాంకర్ గా రాణిస్తూనే, మరోవైపు మోడల్ గా కొత్త కొత్త ఫోటోషూట్స్ తో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో మంజూష బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్ తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ట్రెండ్ ఫాలో అవుతూ.. వీడియోస్ పోస్ట్ చేస్తోంది. తాజాగా మంజూష ‘అరబిక్ కుత్తు’ పాటకు కేకపుట్టించే స్టెప్పులేసి వీడియో పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేసిందో లేదో మంజూష వీడియో వైరల్ అవుతోంది. మరి యాంకర్ మంజూష డాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.