టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ.. విలక్షణ నటుడిగా, రచయితగా ఎదుగుతున్నాడు యంగ్ హీరో అడివి శేష్. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి వరుస హిట్స్ తర్వాత అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఇటీవలే పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఈ మేజర్ సినిమాలో అడివి శేష్ హీరో మాత్రమే కాకుండా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 26/11 ముంబై ఉగ్రదాడులలో మరణించిన ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందింది. అయితే.. ఈ ఇప్పటివరకూ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్.. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఎప్పటికైనా ఓ సినిమా తీయడమే డ్రీమ్ గా భావించి.. మేజర్ సందీప్ కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మేజర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు శేష్.ఇక ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ నుండి సక్సెస్ మీట్స్, ఫ్యాన్స్ తో చిట్ చాట్ వరకూ అన్నింటికీ సోషల్ మీడియానే వేదికగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. సెలబ్రిటీలతో చిట్ చాట్ అయినా, ఏదైనా ఇప్పుడు కొత్తకొత్త పదాలతో పాటు బూతులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎదుటివారికి విషెష్ చెప్పేటప్పుడు కూడా కొన్ని అభ్యంతరకరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. తాజాగా మేజర్ సినిమాతో హిట్టు కొట్టిన అడివి శేష్ ని విష్ చేసేందుకు ట్విట్టర్ లో బూతు పదాన్ని వాడాడు ఓ అభిమాని.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అడివి శేష్ అభిమాని ఒకరు ‘మేజర్’ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించినందుకు విష్ చేస్తూ “జాతిని దెం**వ్ బ్రో” అని ఓ బూతు పదాన్ని ఉపయోగించి ట్వీట్ చేశాడు. సదరు అభిమాని ఉద్దేశం పాజిటివ్ టెన్స్ లోనే ఉన్నప్పటికీ, అది బూతు పదమని అందరికీ తెలుసు. మామూలుగా సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ట్వీట్స్ ని సెలబ్రిటీలు అవైడ్ చేస్తుంటారు. కానీ శేష్ మాత్రం తెలివిగా రిప్లై ఇచ్చి నెటిజన్స్ మనసు దోచుకున్నాడు. శేష్ స్పందిస్తూ.. “జాతిని ప్రేమించాను బ్రో” అని రిప్లై ఇచ్చాడు. అభిమాని అభ్యంతరకరంగా విష్ చేసినా ఓపికగా రిప్లై ఇచ్చినందుకు శేష్ ని కొనియాడుతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా.. మేజర్ సినిమా తర్వాత శేష్ నుండి హిట్-2 మూవీ రాబోతుంది. మరి అభిమాని ట్వీట్ కి శేష్ స్పందించిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.