టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రంభ గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో గ్లామరస్ పాత్రలు చేసి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అప్పట్లో రంభ సినిమాలంటే ఫ్యాన్స్ కి మినిమమ్ గ్లామర్ ట్రీట్ గ్యారంటీ. ఇక తెలుగుతో పాటు తమిళంలో సైతం స్టార్డమ్ ని సొంతం చేసుకున్న రంభ.. చివరిసారిగా దేశముదురు, యమదొంగ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో ఆడిపాడింది. ఆ తర్వాత 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్ ని పెళ్లి చేసుకుంది.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రంభ.. అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లోకి వచ్చాక ఈమె పేరును రంభగా మార్చారు. అయితే.. పెళ్లి తర్వాత పూర్తి సమయాన్ని ఫ్యామిలీ లైఫ్ కే కేటాయించిన రంభకు.. ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. ఇన్నేళ్లయినా తెలుగులో రంభ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఎందుకంటే.. రంభ మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకునే వారితో పాటు.. రీఎంట్రీ ఎప్పుడో అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.
ఇదిలా ఉండగా.. చాలాకాలం తర్వాత రంభ ఇండియాలో ప్రత్యక్షమైంది. అదికూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో తన ఫ్యామిలీతో హాజరై.. దైవ దర్శనం చేసుకుంది రంభ. ఇక ఇన్నేళ్ల తర్వాత రంభ ఇండియాకు రావడం వెనుక కారణం ఏంటని ఆరా తీయగా.. “స్వామివారి దర్శనం బాగా జరిగింది. మా అక్క కూతురి పెళ్లి కోసం ఫ్యామిలీ అంతా వచ్చాము. ప్రస్తుతం ఇంతకు మించి మాట్లాడలేను” అని చెప్పింది రంభ. ప్రస్తుతం రంభ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రంభ గురించి మీ అభిప్రాయలను కామెంట్స్ లో తెలియజేయండి.