ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు ఫ్యాన్స్ కి ఎప్పుడైతే ప్రెగ్నన్సీ అని గుడ్ న్యూస్ చెబుతారో.. అప్పటినుండి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సీమంతం, బేబీ బంప్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ట్రెండ్ అయిపోయింది. తాజాగా కన్నడ బ్యూటీ, హీరోయిన్ ప్రణీత సుభాష్.. భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసింది. ఇటీవలే సీమంతం ఫోటోలు షేర్ చేసిన ప్రణీత.. ఇప్పుడు పోస్ట్ చేసిన బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రణీత.. 2021 లాక్ డౌన్ సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత నెలలో తన భర్త తనను ఎత్తుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ప్రెగ్నన్సీ విషయాన్ని బయటపెట్టింది. తాజాగా బేబీ బంప్ పిక్స్ షేర్ చేసేసరికి ఫ్యాన్స్ అంతా లైక్స్ కొడుతూ విష్ చేస్తున్నారు. ప్రణీత పోస్ట్ చేసిన పిక్స్ లో భర్త నితిన్ ఆమెను ముద్దాడుతున్న పిక్ ట్రెండ్ అవుతోంది. ఇక ప్రణీత విషయానికి వస్తే.. తెలుగులో చాలా సినిమాలు చేసింది.
ప్రణీత తెలుగులో పెద్ద హీరోల సరసన సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్స్ లిస్టులో మాత్రం చేరలేకపోయింది. ప్రస్తుతం ప్రణీత పోస్ట్ చేసిన బేబీ బంప్ పిక్స్ చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. ఫోటోలు పోస్ట్ చేసి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు క్యాప్షన్ జోడించింది. ప్రణీత – నితిన్ రాజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ప్రణీత బేబీ బంప్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.