సినీ ఇండస్ట్రీలో సైడ్ క్యారెక్టర్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న నటీమణులు.. ఒక్కసారిగా అదిరిపోయే అందాల షో చేస్తే ఎంతటివారైనా ఆశ్చర్యపోవాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు అలాంటి షాకే ఇచ్చి.. అందాలతో సర్ప్రైజ్ చేసింది పూజా రామచంద్రన్. బెంగుళూరులో పుట్టి పెరిగిన ఈ బ్యూటీని.. పూజాగా తెలుగు ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చు. కానీ స్వామిరారా సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన బ్యూటీ అంటే మాత్రం ఈజీగా గుర్తుపడతారు. ఆ సినిమాలోని స్విమ్మింగ్ పూల్ సీన్ తో కుర్రకారు మర్చిపోలేని రేంజిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పూజా.
కెరీర్ పరంగా తక్కువ సినిమాలు చేసినప్పటికీ, హాట్ హాట్ అందాల ఫోటోషూట్ లతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. హీరోయిన్ లాంటి ఫిట్నెస్, ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది కానీ ఇప్పటివరకు నటిగా చెప్పుకోదగ్గ రోల్ చేయలేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం సినిమాలలో సైడ్ రోల్స్ చేసిన పూజా.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా పాల్గొంది. అక్కడ పెద్దగా క్రేజ్ రాకపోయేసరికి బయటికి వచ్చాక భర్తతో కలిసి హాట్ ఫోటోషూట్స్ లో పాల్గొనడం ప్రారంభించింది.
ఇంతకీ పూజా భర్త ఎవరో కాదు.. ఎక్కువగా విలన్ రోల్స్ లో కనిపించే నటుడు జాన్ కొక్కెన్. సర్పట్ట సినిమా వరకు జాన్ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఆ సినిమాలో ఆర్యకు పోటీగా వేటపులి పాత్రలో అదరగొట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. నెట్టింట వీరు పెట్టే ఫోటోలు, వీడియోలు అంతలా వైరల్ అవుతుంటాయి.
ముఖ్యంగా పూజా సినిమాలలో ఎంత క్లాస్ గా, పద్దతిగా కనిపిస్తుందో.. ఫోటోషూట్స్ విషయానికి వస్తే బికినీలు ధరించి కాక పుట్టిస్తుంది. పూజా – జాన్ ఇద్దరూ కూడా ఆల్రెడీ వేరొకరిని పెళ్ళాడి, విడిపోయాక రెండో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇటీవలే ఈ జంట మూడో యానివెర్సరీ సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్ లో భర్తతో కలిసి బికినీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం నెట్టింట పూజా టాప్ టు బాటమ్ అందాల విందు వైరల్ అవుతోంది. మరి పూజా రామచంద్రన్ గ్లామర్ ట్రీట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ లో తెలియజేయండి.