తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని హీరోయిన్లలో హంసా నందిని ఒకరు. దాదాపు 20 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముంబై బ్యూటీ.. ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేక పోయింది. అయితే.. మోడల్ గా, ఐటమ్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవల హంసా క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే.
కొంతకాలంగా క్యాన్సర్ చికిత్స పొందుతూ.. అప్పుడప్పుడు ఫ్యాన్స్ కి సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తోంది. తాజాగా హంసా హెల్త్ పై ఇంస్టాగ్రామ్ లో కొత్త పోస్ట్ పెట్టింది. ‘ఇప్పటివరకు 16 సైకిల్స్ పాటు కీమో థెరపీ చేశారు. నేనిప్పుడు అఫీషియల్ గా కీమో నుంచి కోలుకున్నాను. కానీ చికిత్స ఇంకా పూర్తి కాలేదు. తదుపరి పోరాటానికి నేను సిద్ధం కావాల్సిన సమయం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది’ అంటూ ఇన్ స్టాలో క్యాప్షన్ జోడించింది.
ప్రస్తుతం హంసా పోస్ట్ పై సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ భామ మిర్చి సినిమాలో ప్రభాస్ సరసన కాలు కదిపి మంచి ఫేమ్ దక్కించుకుంది. అప్పటినుండి వెనుదిరిగి చూడకుండా వరుసగా స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ మోడలింగ్ చేస్తోంది. మరి హంసా నందిని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.