కెరీర్ ప్రారంభంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి మూవీలో కనిపించిన నటి.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇప్పుడెలా ఉందో తెలుసా?
కొన్ని సినిమాల్లో హీరోయిన్ల కంటే వాళ్లకు ఫ్రెండ్ గా చేసిన యాక్టర్స్ ఫేమస్ అవుతుంటారు. అలా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీలో చేసిన ఈ నటి.. ఆ తర్వాత చాలా పాపులర్ అయిపోయింది. చెప్పాలంటే హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. సీక్రెట్ గా ఓ డైరెక్టర్ ని పెళ్లి చేసుకుందట. మరో నటి చెప్పడంతో ఈమె మ్యారేజ్ సంగతి బయటకొచ్చింది. మరి ఇంతలా చెబుతున్నాం కదా.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే రివీల్ చేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఓ మాల్ సీన్ లో మహేష్ ని చూసి ప్రపోజ్ చేసే సీన్ చేసిన ఈ బ్యూటీ పేరు ధన్య బాలకృష్ణ. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఈ భామ.. సౌత్ లోని దాదాపు అన్ని ఇండస్ట్రీలను కవర్ చేసేసింది. సూర్య ‘7th సెన్స్’తో నటిగా మారింది. ‘లవ్ ఫెయిల్యూర్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి దాదాపు 20-30 సినిమాల్లో నటించింది. గతేడాది ఓటీటీలో రిలీజైన ‘జగమే మాయ’లో హీరోయిన్ గానూ చేసింది. ప్రస్తుతం కన్నడలో ఓ రెండు సినిమాలు చేస్తోంది.
సినిమాలతో పాటు ఓటీటీలో వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ భామ.. తనని తెలుగులో పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ మోహన్ ని పెళ్లి చేసుకుందని అంటున్నారు. కానీ అది నిజమో కాదో తెలియదు. సరే అదంతా పక్కనబెడితే.. కెరీర్ స్టార్టింగ్ లో సింపుల్ గా ఉన్న ధన్య.. ఇప్పుడు మాత్రం మంచి ఫిజిక్ తోపాటు గ్లామర్ ని చాలా అంటే చాలా డెవలప్ చేసుకుంది. అప్పుడు-ఇప్పుడు పిక్స్ చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. సో అది విషయం. మరి మీలో ఎంతమంది svscలో ఈమెని చూసి గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.