ఆంధ్రప్రదేశ్ పర్యటాకట శాక మంత్రి ఆర్కే రోజా.. మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోజా వ్యాఖ్యలపై జనసేన, మెగా అభిమానులే కాక.. పలువురు సెలబ్రిటీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. హైపర్ ఆది రోజా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇక ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం రోజా మీడియాతో మాట్లాడుతూ రోజా.. మరోసారి మెగా ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు. హైపర్ ఆది కామెంట్స్‌పై ఆమె స్పందిస్తూ.. ఇండస్ట్రీలోని చిన్న చిన్న ఆర్టిస్టులు మెగా ఫ్యామిలీని చూసి భయపడుతున్నారని అన్నారు. మెగా ఫ్యామిలీపై వారికి ప్రేమ లేదని.. భయం మాత్రమే ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘‘వాళ్లెంత.. వాళ్ల ప్రాణమెంత. అలాంటి వాళ్లు మాట్లాడుతున్నారు అంటే.. వాళ్లతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అలాంటి వాళ్లను మనం అనడం వేస్ట్. వాళ్లేదో చిన్న చిన్న షోలు, క్యారెక్టర్స్ చేసుకుంటారు. మీకు తెలియనిదేముంది.. మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే.. ఆ కుటుంబంతో ఉన్నారు తప్ప.. వారి మీద ప్రేమతో కాదు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్లు ప్రకాష్ రాజ్‌కు సపోర్ట్ చేసినప్పుడు.. తను ఎందుకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే భయం వేరే. కాబట్టి చిన్న చిన్నవాళ్లను తిట్టాలని నేను అనుకోను. ఎవరైతే మాట్లాడారో వాళ్లు కూడా తెలుసుకోవాలి. మంత్రులకు శాఖలే తెలియదంటారు. శాఖలే తెలియకుండా మంత్రులు అయిపోతారా? మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా కూడా గెలిపించలేదు’’ అంటూ రోజా ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
అయితే మంత్రి రోజా వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. చిరంజీవి, ఆయన కుటుంబం గురించి పూర్తిగా తెలిసిన రోజా.. రాజకీయాల కోసం ఇలా మాట్లాడటం సబబు కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రోజా వ్యాఖ్యలపై నటుడు బ్రహ్మాజీ కూడా మండి పడ్డాడు. ట్విట్టర్ వేదికగా.. రోజాకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ.. ‘‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ క్యాంపెయిన్ చెయ్యమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు’’ అని ట్వీట్ చేశాడు. అంటే చిన్న ఆర్టిస్ట్‌ల మాటలకు మీరేందుకు భయపడుతున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా రోజాపై సెటైర్లు వేశాడు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. మరి రోజా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ campain చెయ్యమని కానీ పార్టీ లో చేరమని కానీ అడగలేదు .
చిన్న ఆర్టిస్ట్ లే కదా .. అంత బయపడతారెందుకు .. https://t.co/9W0gU2uF98— Brahmaji (@actorbrahmaji) January 19, 2023