పాన్ ఇండియా మూవీగా విడుదలైన “పుష్ప” బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పుష్ప దెబ్బకి.. నెటిజన్స్ అంతా తగ్గేదే లే అంటూ రీల్స్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా అంతటా ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా కూడా త్వరలోనే బ్రేక్ ఈవెన్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్.. పుష్ప డిలీటెడ్ సీన్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.
పుష్ప టోటల్ రన్ టైమ్ బాగా పెరిగిపోవడంతో ఈ సీన్ తీసేయక తప్పలేదు. కానీ.., ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ డిలీటెడ్ సీన్ సైతం తగ్గేదే లే అన్న రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా పుష్పరాజ్ మిల్లులో పని మానేశాక.. అప్పు కట్టమని అతని తల్లిని ఓ వ్యక్తి దుర్భషలాడటం, పుష్ప వెంటనే ఆ అప్పు కట్టేసి అతనికి బుద్ధి చెప్పడం వంటి సన్నీవేశాలతో ఈ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ డిలీటెడ్ సీన్స్ చూసిన ప్రేక్షకులు ఇవి కూడా సినిమాలో ఉంటే బాగుండేది అన్న కామెంట్స్ చేస్తున్నారు. మరి.. పుష్ప డిలీటెడ్ సీన్స్ ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.