ఈ వార్త వింటే జూనియర్ అభిమానులు ఎగిరి గంతేస్తారు. అటు ప్రశాంత్ నీల్ సినిమాతో ఇటు వార్ 2తో బిజిగా ఉన్న జూనియర్ నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ అప్‌డేట్ వివరాలు మీ కోసం..
జూనియర్ ఎన్టీఆర్ గురించి క్రేజీ అప్‌డేట్ ఒకటి ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతోంది. బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్, కియారా అద్వానీతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 మరో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో క్రేజీ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అంతేకాకుండా బజ్ క్రియేట్ చేస్తోంది.
జూనియర్ నెక్స్ట్ సినిమా కాంతారా 3 ?
కన్నడ పాన్ ఇండియా సినిమాగా సూపర్ డూపర్ హిట్ కొట్టిన కాంతారా సిరీస్‌లో జూనియర్ పేరు విన్పిస్తోంది. కాంతారా 3 లో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించనున్నాడనేది ఈ బిగ్ అప్‌డేట్. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా కాంతారా దర్శకుడు, నటుడు రిషభ్ శెట్టితో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న సంబంధాలు ఈ వార్తకు బలం చేకూరుస్తున్నాయి. ఈ సినిమా ద్వారా కన్నడ నాట అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కాంతారా 3 తెరపై రిషభ్ శెట్టి-జూనియర్ ఎన్టీఆర్ కన్పిస్తే ఫ్యాన్స్‌కు నిజంగా పండగే మరి.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయితే దేవర 2 రేసులో ఉంటుంది. ఇదిలా ఉండగా రిషభ్ శెట్టి ఇప్పటికే తెలుగు కన్నడ ద్విభాషా చిత్రాన్ని అశ్వన్ గంగరాజు దర్శకత్వంలో ప్రకటించాడు. ఈ సినిమా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది.