ఐపీఎల్ 2022లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జట్టులోని ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తుండడంతో ఆ జట్టుకు ఎదురులేకుండా పోయింది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న గుజరాత్ టైటిల్ గెలవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. మే 29(ఆదివారం) రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అమితుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టులోని స్టార్ ప్లేయర్ మాథ్యూ వేడ్ ఐపీఎల్ 2022 సీజన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్ వ్యక్తిగతంగా తన బ్యాటింగ్ చాలా చిరాకు కలిగిస్తోందని పేర్కొన్నాడు. వేడ్ మాట్లాడుతూ..” ఐపీఎల్ 2022 సీజన్.. వ్యక్తిగతంగా టోర్నమెంట్ మొత్తం నాకు చికాకు తెప్పించింది. బ్యాటింగ్ సరిగా చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం. మంచి షాట్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికి వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మలచలేకపోతున్నా. రాజస్థాన్ రాయల్స్‌తో కీలకమైన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో 35 పరుగులు చేసే వరకు నాది చెత్త బ్యాటింగ్ లాగానే కనిపించింది. టీ20 క్రికెట్‌లో దూకుడుగా ఆడితేనే కలిసొస్తుంది. ఆ ప్లాన్‌లో నేను విఫలమయ్యా. కీలకమైన ఫైనల్‌కు ముందు కాస్త మంచి బ్యాటింగ్ చేయడం ఆనందం కలిగించింది.ఒక ఆటగాడిగా విఫలమైనప్పుడు కెప్టెన్ మద్దతు ఉండాలి. ఆ విషయంలో హార్దిక్ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంది. తొలి స్థానం నుంచి ఏడో స్థానం వరకు మా జట్టులో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. రషీద్ ఖాన్ రూపంలో ఏడో నంబర్ వరకు విధ్వంసకర బ్యాటింగ్ మా సొంతం. ఇక ఈసారి కప్ గుజరాత్‌దే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాథ్యూ వేడ్ 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. 2011లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మాథ్యూ వేడ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తొమ్మిది ఇన్నింగ్స్‌లో పెద్దగా ఆకట్టుకోని వేడ్.. చివరగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో మాత్రం 35 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో వేడ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మరి వేడ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022 Playoffs: ఫాఫ్ డు ప్లెసిస్ తప్పు లేదా? కోహ్లీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే RCB కొంపముంచిందా?
Gujarat Titans Matthew Wade makes BIG statement ahead of IPL 2022 final against Rajasthan Royals #IPL2022 #GTvsRR #MatthewWade https://t.co/I1x8NjXNwT
— Zee News English (@ZeeNewsEnglish) May 28, 2022