ఐపీఎల్ 2022లో భాగంగా 35వ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే 6 మ్యాచ్‌ల్లో 5 గెలుపులతో గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అలాగే కేకేఆర్ టోర్నీ ప్రారంభంలో అదరగొట్టిన తర్వాత తడబడుతుంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 3 గెలుపులతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే వారి బలాబలాలు పరిశీలిద్దాం..
గుజరాత్ టైటాన్స్..ఈ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా గత మ్యాచ్‌లో ఆడలేదు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. పాండ్యా లేకున్నా ఆ జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంగా కనిపిస్తుంది. వారి ప్రదర్శన అంచనాలకు మించి ఉంటుంది. కాగా ఓపెనర్లు మంచి భాగస్వామ్యం ఇవ్వకపోవడం ఒక మైనస్. వాస్తవానికి గుజరాత్ బ్యాటింగ్‌లో కంటే బౌలింగ్‌లోనే పటిష్టంగా ఉంది. షమీ, ఫెర్గుసన్, రషీద్ ఖాన్ లాంటి వికెట్ టేకర్లు గుజరాత్ సొంతం.
కేకేఆర్..పేపర్‌పై దుర్భేద్యంగా ఉన్న కేకేఆర్ గత కొన్ని మ్యాచ్‌లలో అంచనాలను అందుకోలేకపోయింది. వీరి బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. దాదాపు 8 వికెట్లు పడిపోయిన కూడా పరుగుల చేసే వారు ఉన్నారు. ఆరోన్ ఫించ్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. అలాగే ఎన్నో ఆశలు పెట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ అంచనాలకు తగ్గట్లు ఆడటం లేదు. బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్ భారీగా పరుగులు ఇస్తున్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరణ్ చక్రవర్తి ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం కేకేఆర్‌కు భారంగా మారింది.
పిచ్..
ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
ప్రిడిక్షన్..
ఇరు జట్ల బలాలు, బలహీనతలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే టాస్ కూడా ఈ మ్యాచ్‌లో కీలకం కానుంది. కేకేఆర్ బ్యాటర్లు వాళ్ల స్థాయితగ్గ ప్రదర్శన కనబరిస్తే.. విజయం ఖాయం.
తుది జట్ల అంచనా..
కోల్‌కతా నైట్ రైడర్స్.. శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, శివమ్ మావి.
గుజరాత్ టైటాన్స్..
హార్థిక్ పాండ్యా(కెప్టెన్), మ్యాథ్యూ వేడ్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, మిల్లర్, తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, షమీ, ఫెర్గుసన్, నల్కండే.
We go again with 2️⃣ points in mind! 💪#KKRHaiTaiyaar #KKRvGT #IPL2022 pic.twitter.com/tZ4Tn6PJRf
— KolkataKnightRiders (@KKRiders) April 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.