టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. లోస్కోరింగ్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే టాప్ స్కోరర్. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్స్ కూడా అతని బ్యాట్ నుంచి రాలేదు.
భారీ స్కోర్ చేస్తాడనుకున్న బట్లర్ ఫైనల్స్‌లో తేలిపోయాడు. యశస్వి జైస్వాల్-22, కేప్టెన్ సంజు శాంసన్-14, దేవ్‌దత్ పడిక్కల్-2, షిమ్రోన్ హెట్మెయిర్-11, రవిచంద్రన్ అశ్విన్-6, రియాన్ పరాగ్-15, ట్రెంట్ బౌల్ట్-11, ఒబెద్ మెక్‌కే-8.. ఇలా సాగింది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్. జోస్ బట్లర్ ఆ మాత్రం స్కోర్ చేయకపోయి ఉంటే.. రాజస్థాన్ రాయల్స్ 100 పరుగుల్లోపే చాప చుట్టేసి ఉండేదనడంలో సందేహాలు లేదు. ఈ ఐపీఎల్ మొత్తానికి 149.71 స్ట్రైక్ రేట్‌తో ఆడిన జోస్ బట్లర్.. ఫైనల్స్‌లో ఆ స్థాయిలో దూకుడును ప్రదర్శించలేకపోయాడు. 39 పరుగులు చేయడానికి 35 బంతులను తీసుకున్నాడు. తన మార్క్ షాట్ ఆడలేదు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు తడబడుతూ కనిపించాడు.
అలాగని గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ భయపెట్టిందా అంటే అదీ లేదు. కాస్త లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి బంతులను సంధించితే షాట్లు కొట్టలేనంత బలహీనుడేమీ కాదు బట్లర్. జట్టు స్కోరు 79 పరుగుల వద్ద ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బట్లర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 13వ ఓవర్ తొలి బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా తరలించబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. అది కాస్తా బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేతుల్లో వాలింది. దీంతో అవుటైన అసహనం బట్లర్‌లో స్పష్టంగా కనిపించింది. డగౌట్ ఇంకా కొంతదూరం ఉందనగానే.. హెల్మెట్‌ను విసిరేశాడు. గ్లోవ్స్‌ను నేలకు విసిరికొట్టాడు. దీంతో డగౌట్‌లోని ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. బట్లర్‌ను ఇంత కోపంగా వారు ఎప్పుడూ చూసి ఉండరు అందుకే బట్లర్ కోపానికి షాక్‌తిన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: ఫైనల్‌లో చేతులెత్తేసిన రాజస్థాన్! ఏడ్చేసిన జోస్ బట్లర్
— Cred Bounty (@credbounty) May 29, 2022