హార్థిక్ పాండ్యా.. చాలా అగ్రెసివ్ ప్లేయర్. టీమిండియాకు ఆడేటప్పుడు, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడే సమయంలో కూడా గ్రౌండ్ చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడు. కానీ ఐపీఎల్ 2022లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయిత తర్వాత అతని ప్రవర్తనలో కొంత మార్పు వచ్చినట్లు కనిపించింది. చాలా కూల్ అండ్ కామ్ కెప్టెన్లా కనిపించాడు. యువ క్రికెటర్లు పరుగులు చేయకున్నా, బౌలర్లు పరుగులు ఇచ్చినా కోపడకుండా.. వారికి ధైర్యం చెప్పేవాడు. కానీ అది తొలి రెండు మ్యాచ్‌లకే పరిమితం చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో ఒత్తిడి ఉండడంతో అతనిలోని అసలు పాండ్యా బయటికి వచ్చాడని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నాడు.
పంజాబ్‌తో మ్యాచ్‌లో లేని రన్ కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యి.. ఆ కోపం డేవిడ్ మిల్లర్‌పై చూపించాడు. తాజాగా.. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో జరిగి మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ షమీపై నోరుపారేసుకుని విమర్శల పాలవుతున్నాడు. సన్‌రైజర్స్ ఛేజింగ్‌లో హార్థిక్‌పాండ్యా 13వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్ చివరి బంతిని SRH బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ షాట్ ఆడాడు. అది కాస్త గాల్లో ఫ్లై అవుతూ.. థర్డ్ మ్యాచ్ దిశగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న షమీ క్యాచ్ కోసం ప్రయత్నించకుండా వన్ స్టప్ తర్వాత బాల్పట్టుకుని వికెట్ కీపర్‌కు విసిరాడు. ఒక పరుగు వచ్చింది. క్యాచ్ ఎందుకు పట్టలేదంటూ హార్థిక్ పాండ్యా.. షమీపై నోరు పారేసుకున్నాడు. కోపంగా అరుస్తు కనిపించాడు. హార్థిక్ ప్రవర్తనతో షమీ చిన్న బుచ్చుకున్నట్లు అర్థం అవుతుంది.నిజానికి ఆ బాల్ షమీకి చాలా దూరంలో పడింది. ఆ బంతి ఎత్తు తక్కువ ఉండడంతో.. ఫ్లాట్‌గా వస్తుండడంతో షమీ క్యాచ్‌కు ప్రయత్నించలేదు. క్యాచ్‌కు ప్రయత్నించి ఉంటే ఆ బాల్ కచ్చితంగా బౌండరీ వెళ్లేదని, అయినా క్యాచ్ కోసం ప్రయత్నించే అంతే టైమ్ అక్కడ లేదని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నాడు. ఇవి గమనించకుండా.. మ్యాచ్ చేజారి పోతుందనే కోపంలో పాండ్యా షమీపై అనవసరంగా నోరు పారేసుకున్నాడని నెటిజన్లు పాండ్యాపై ఫైర్ అవుతున్నారు. కెప్టెన్‌గా ఉంటూ ఇలాంటి ప్రవర్తన మంచిది కాదని హితవుపలుకుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో వైరల్: అంపైర్ అయ్యావ్ కాబట్టి సరిపోయింది.. లేదంటే..?
— Rishobpuant (@rishobpuant) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.