ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తమ ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఏడో గెలుపును తమ ఖాతాలో వేసుకుని 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం సాధిస్తే దాదాపుగా ప్లేఆఫ్స్‌కు చేరినట్లే. ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీని కొత్త కెప్టెన్ డుప్లెసిస్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. కీలకమైన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రన్ మెషీన్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా నిరాశపర్చి డకౌట్‌గా వెనుదిరిగినా.. డుప్లెసిస్ పట్టువదలకుండా.. చివరి వరకు క్రీజ్‌లో నిల్చున్నాడు.
50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. కానీ.. మ్యాచ్ అనంతరం డుపెస్లిస్ మాట్లాడుతూ.. ఇన్నింగ్స్ మధ్యలోనే నాకు అవుట్ అవ్వాలనిపించింది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజ్‌లో ఉన్న తాను అప్పటికే చాలా అలిసిపోయినట్లు డుప్లెసిస్ తెలిపాడు. పైగా మ్యాచ్ మధ్యాహ్నం కావడం.. తొలుత బ్యాటింగ్ ఆర్సీబీ చేయాల్సి రావడంతో ఎండకు తట్టుకోలేకపోయినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా తాను అవుట్ అయితే భీకరమైన ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్ క్రీజ్‌లోకి వస్తాడని ఆశించానని అన్నాడు.డీకే వస్తే డెత్ ఓవర్స్‌లో టీమ్ భారీగా పరుగులు వస్తాయని తాను భావించినట్లు చెప్పాడు. అందుకే తాను అవుట్ అయితే బాగుండు అనుకున్నానని.. కానీ అంతలోనే మాక్స్‌వెల్ అవుట్ అవ్వడంతో డీకే బ్యాటింగ్‌కు వచ్చాడని అన్నాడు. డుప్లెసిస్ నమ్మకాన్ని నిలబెడుతూ.. క్రీజ్‌లోకి వచ్చిన దినేష్ కార్తీక్.. కేవలం 8 బంతుల్లోనే 4 సిక్సులు, ఒక ఫోర్‌తో 30 పరుగులు చేసి సన్‌రైజర్స్ ముందు 192 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేశాడు. ఇలా తన అలసటకు తోడు డీకే బ్యాటింగ్‌కు రావాలని డుప్లెసిస్ లాంటి ఆటగాడు కూడా తన వికెట్ పడితే బాగుండు అని అనుకోవడంపై నిజంగా గొప్ప విషయం అని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. డీకే ఉన్న ఫామ్‌కు, చివర్‌లో అతను ఆడుతున్న ఇన్నింగ్స్‌లకు డుప్లెసిస్ అలా భావించడంలో ఏ మాత్రం తప్పులేదంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ధోని! IPL చరిత్రలోనే తొలి ప్లేయర్
‘If he is hitting sixes like that, we want to get him in and bat as long as possible’- Faf du Plessis.#SRHvsRCB #IPL2022 #dineshkarthik https://t.co/tgRpmg7WRt
— India Today Sports (@ITGDsports) May 8, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.