ఐపీఎల్ 2022లో మరో అంపైరింగ్ తప్పిదంపై చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్‌లో బోలెడు అంపైరింగ్ తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నిర్ణయం అంపైర్ తప్పుగా ఇచ్చారంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదం కారణంగా ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పెవిలియన్ చేరాడు. టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఉన్నా థర్డ్ అంపైర్ అత్యుత్సాహంతో తన నిర్ణయాన్ని ప్రకటించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
కచ్చితంగా అవుట్ అనే స్పష్టత లేకున్నా.. బౌలర్ ఫేవర్‌లో తన నిర్ణయం ఇచ్చాడు. స్పష్టత లేని సందర్భాల్లో బ్యాటర్‌కు అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి. కానీ వార్నర్ విషయంలో మాత్రం థర్డ్ అంపైర్ రూల్స్‌కు వ్యతిరేకంగా తన నిర్ణయం ఇచ్చారు. దీంతో క్రికెట్ అభిమానులు చెత్త అంపైరింగ్ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సందర్భంగా మోహ్‌సిన్ ఖాన్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని మోహ్‌సిన్ ఖాన్ లెంగ్త్ బాల్‌గా వేయగా.. డేవిడ్ వార్నర్ పుల్ చేశాడు.
అయితే బ్యాట్ అంచున తాకిన బంతి ఫార్వార్డ్ ఫీల్డర్ ఆయుశ్ బదోని వైపు దూసుకెళ్లింది. ఈ బంతిని బదోని అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో అది నేలకు తాకినట్లు అనిపించింది. డేవిడ్ వార్నర్ సైతం ఇదే విషయాన్ని అంపైర్లకు తెలియజేశాడు. థర్డ్ అంపైర్ సమీక్ష తీసుకోగా.. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి అవుట్‌గా ప్రకటించాడు. బంతి కింద ఫీల్డర్ వేళ్లు ఉన్నాయని థర్డ్ అంపైర్ చెప్పాడు. అయితే రీప్లేలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది. కానీ క్లారిటీ లేదు. ఇంకాస్త బెటర్ యాంగిల్‌లో చూడాల్సింది.
కానీ థర్డ్ అంపైర్ ఫీల్డర్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు. వాస్తవానికి బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మన్ కింద నాటౌట్‌గా ఇవ్వాలి. మొత్తానికి అంపైర్ తప్పిదం కారణంగా డేవిడ్ వార్నర్(3) నిరాశగా పెవిలియన్ చేరాడు. కానీ.. సోషల్ మీడియాలో ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. పైగా ఈ మ్యాచలో ఢిల్లీ తక్కువ తేడాతోనే ఓడిపోవడంతో.. అంపైర్ తప్పుడు నిర్ణయంపై మరింత కోపం పెంచుకుంటున్నారు ఢిల్లీ ఫ్యాన్స్. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Umran Malik: మరింత స్పీడ్ పెంచిన ఉమ్రాన్ మాలిక్! ఐపీఎల్‌లోనే నం.1
Low class umpiring 🤦🏻♂️ Whats your decision guys ? #DavidWarner #Delhicapitals #IPL2022 #DCvsLSG pic.twitter.com/uUZcTllJEv
— Rajesh_17 (@Rajeshs56175041) May 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.